విడాకులపై తొలిసారి స్పందించిన మనీషా కోయిరాలా!
కానీ వాటిలో ఏది పెళ్లి వరకూ దారి తీయలేదని రకరరకాల విమర్శలు ఎదుర్కుంది.
By: Tupaki Desk | 17 March 2024 10:33 AM GMTనేపాల్ బ్యూటీగా బాప్ మనీషా కోయిరాలా సినీ జర్నీ గురించి తెలిసిందే. తెలుగు..తమిళ్..హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. వెడితెరపైనే కాదు..బుల్లి తెరపైనా సత్తా చాటిన నటి. కానీ మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంది. ఆమె చాలా మందితో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో ప్రచారం సాగింది.
కానీ వాటిలో ఏది పెళ్లి వరకూ దారి తీయలేదని రకరరకాల విమర్శలు ఎదుర్కుంది. అటుపై కొన్నాళ్లకు మనీషా 2010న నేపాల్ పారిశ్రామికవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి సంబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఆ బంధం రెండు నెలల్లోనే వీగిపోయింది. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో విడాకులతో వేరయ్యారు. దీని గురించి మనీషా కోయిరాలా ఎక్కడా పెద్దగా మాట్లాడింది కూడా లేదు.
తాజాగా విడాకుల గురించి స్పందించింది. `నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు` అంటూ విఫలమైన వివాహం గురించి తెలిపింది. `పెళ్లయిన ఆరు నెలల తర్వాత నా భర్త నాకు శత్రువు అయ్యా డు. స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌తో కూడా మనీషాకు ఎఫైర్ ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే నానా పటేకర్ కి అప్పటికే వివాహమైంది.
ఇంకా వివేక్ ముశ్రన్.. డీజే హుస్సేన్.. సిసిల్ ఆంథోనీ.. ఆర్యన్ వేద్.. ప్రశాంత్ చౌదరి.. క్రిస్పిన్ కాన్రాయ్.. తారిక్ ప్రేమ్‌జీ.. రాజీవ్ మూల్‌చందానీ.. క్రిస్టోఫర్ డోరిస్‌లతో మనీషాకొయిరాలా ప్రేమాయణం నడిపిందని గుసగుసలు వినిపించాయి. మనీషా సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడికి ఇక్కడ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది.