ఎంతో కాలం బ్రతకను అనుకున్నా! మనీషా కోయిరాలా
బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా అండాశయ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 2 May 2024 5:44 AM GMTబాలీవుడ్ నటి మనీషా కోయిరాలా అండాశయ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. మహమ్మారితో మనీషా ఓయోధిరాలిలా పోరాటం చేసం నెగ్గింది. ఆ విషయంలో ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ఆదర్శంగానిలిచింది. కోలుకున్న అనంతరం తన అనుభవాల్ని ఓ పుస్తక రూపంలోనూ తీసుకొచ్చింది. మహమ్మారిని జయించడానికి మానసికంగా ఎలా సిద్దమైంది అన్న అంశాల్ని ఆ పుస్తకంలో పొందరు పరిచింది. అప్పటి నుంచి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటుంది.
జాతీయ క్యాన్సర్ దినోత్సవం రోజున మనీషా నుంచి ఏదోరకమైన కార్య్రక్రమం తప్పక నిర్వహిస్తుంటుంది. తాను క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి క్రికెట్ యువరాజ్ సింగ్ స్పూర్తి అని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాన్సర్ తో పోరాడిన సమయంలో తాను అనుభవించిన బాధను గుర్తు చేసుకున్నారు. `అండాశయ క్యాన్సర్ నాల్గవ దశకు చేరుకోవడంతో జీవితంపై ఆశలు కోల్పోయాను. ఎంత కాలం బ్రతుకుతానో అనుకుంటూ కాలం గడిపేదాన్ని.
నాజీవితం అయిపోయిందని బాధపడేదాన్ని. కానీ అదృష్టవశాత్తు క్యాన్సర్ ని జయించాను. `హీరామండి`తో ప్రేక్షకులకు ముందుకు రావడం ద్వారా నటిగా రెండవ జీవితాను పొందాను అనిపిస్తుంది` అని అన్నారు. మనీషా కోయిరాలా 2012 లో క్యాన్సర్ బారిన పడ్డట్లు గుర్తించారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చికిత్స లో ఉండిపోయారు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆసమయంలో మనీషా కోలుకోవాలని అభిమానులు...సెలబ్రిటీలంతా ఎంతో ప్రార్ధించారు.
ఆ ప్రార్ధనలు ఫలించడంతో మనీషా వేగంగానే కోలుకున్నారు. కానీ పూర్తి ఆరోగ్య వంతంగా మారడానికి మాత్రం సమయం పట్టింది. ఆసమయంలో మనీషా రిలీజ్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యారు. అయితే అప్పటి నుంచి మునుపటి అంత వేగంగ సినిమాలు చేయలేదు. దీంతో పాటు వయసు కూడా సహకరించ లేదు. ప్రస్తుతం ఆమె వయసు 53 ఏళ్లు. గత ఏడాది `షెహజాదా`లో నటించారు. ఇటీవలే రిలీజ్ ` హీరామండి`లోనూ నటించిన సంగతి తెలిసిందే.