జలగల మధ్యలో రన్నింగ్ ఒణికిపోయాను!
అయితే ఈ పాట మాత్రం మనీషా కోయిరాలకు ఓ టెర్రర్ లాంటింది అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 24 Aug 2024 12:30 PM GMTమణిరత్నం ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ 'బొంబాయి' గురించి చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్న గొప్ప చిత్రమది. శేఖర్ గా అరవింద్ స్వామి, షైలా భాను పాత్రలో మనీషా కోయిరాలా వెండి తెరపై మెరిసన వైనం ఓ అద్భుతం. సినిమా కథ అంతా ఒక ఎత్తైతే రెహమాన్ సంగీతం మరో ఎత్తు. రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అయింది. అందులో ప్రతీ పాట ఆణిముత్యమే.
ఇప్పటికీ ఆ పాటలు మార్మొగుతూనే ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రియంగా ఆకట్టుకున్న పాట ఊరికే చిలక గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటలో అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా అభినయించిన తీరు గుండెలు పిండేస్తుంది. కోట్లాది మంది శ్రోతల హృదయాల్లో నిలిచిన ఓక్లాసిక్ సాంగ్ అది. అయితే ఈ పాట మాత్రం మనీషా కోయిరాలకు ఓ టెర్రర్ లాంటింది అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ సంగతేంటో ఆమె మాటల్లోనే...' అందర్నీ ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంది. కానీ నాకు ఆ పాట అంటేనే ఒణుకుపుడుతుంది. ఈ పాటషూటింగ్ సముద్రం ఒడ్డున ఉన్న ఓపురాతన కట్టడం వద్ద జరిగింది. అక్కడ పెద్ద పెద్ద రాళు..ముళ్ల పొదలు, చెట్లతో నిండి ఉంది. నేలంతా ఎంతో తడిగా ఉంది. దీంతో జలగలు భారీగా ఉన్నాయి. ఈ పాటలో నేను పొడవాటి నీలిరంగు దుస్తుల్లో అక్కడ పరిగెత్తాలి.
కానీ కాలు కింద పెడితే ఎక్కడ జలగలు పట్టి రక్తం పీల్చేస్తాయేమోన్న భయం వెంటాడింది. చాలా భయ పడ్డాను. నా పరిస్థితిని యూనిట్ అర్దం చేసుకుంది. ఆ పాట కోసం బూట్లు వేసుకోమని తెచ్చి ఇచ్చారు. నేలపై ఉప్పు చల్లారు. దీంతో కొంచెం పరిస్థితి మెరుగు పడింది' అని తెలిపింది.