Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ ఆమెని రీ-లాంచ్ చేస్తున్నాడా?

'ఇండియన్ -2' లో మనీషా కోయిరాలో కూడా న‌టిస్తుందా? 53 ఏళ్ల న‌టిని ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:49 AM GMT
ఆ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ ఆమెని రీ-లాంచ్ చేస్తున్నాడా?
X

'ఇండియన్ -2' లో మనీషా కోయిరాలో కూడా న‌టిస్తుందా? 53 ఏళ్ల న‌టిని ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ హీరోగా 'భార‌తీయుడు' కి సీక్వెల్ గా 'ఇండియ‌న్ -2' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా పూర్తి చేసుకుంటుంది. వ‌చ్చే నెల‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇందులో క‌మ‌ల్ హాసన్ తో పాటు సిద్దార్ధ్, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్. జెసూర్య కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. తొలుత కాజ‌ల్ అగ‌ర్వాల్ పై కూడా కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. కానీ ఎందుక‌నో ఆమెని త‌ప్పించి 'ఇండియ‌న్ -3'కి మార్చారు. కీల‌క పాత్ర‌లకు సంబంధించి ఇంత‌వ‌ర‌కూ ఉన్న అధికారిక స‌మాచారం ఇదే. అయితే ఇందులో మనీషా కోయిరాలా కూడా న‌టిస్తుంది? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది.

ఆమె పాత్ర‌ని ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా యూనిట్ జాగ్ర‌త్త ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల శంక‌ర్ తో మ‌నీషా కోయిరాలా ఉన్న కొన్ని ఫోటోలు లీక్ అవ్వ‌డంతోనే ఈ విషయం బ‌య‌ట‌కి పొక్కింది. మ‌నీషా పాత్ర‌ని హైడ్ చేసి నేరుగా తెర‌పై స‌ర్ ప్రైజ్ చేయాల‌నే యూనిట్ ఇలా ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే 53 ఏళ్ల న‌టి ఎలాంటి పాత్ర పోషిస్తుంద‌న్ని చూడాలి. సినిమా హిట్ అయితే మ‌నీషాకి మంచి కంబ్యాక్ కూడా అవుతుంది.

'భార‌తీయుడు' లో క‌మ‌ల్ హాస‌న్ కి జోడీ మ‌నీషా కోయిరాలా జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత శంక‌ర్ తెర‌కెక్కించిన 'ఒకే ఒక్క‌డు' సినిమాలోనూ న‌టించింది. ఈ రెండు అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసాయి. మ‌రి మ‌నీషా ఎంట్రీ ఇండియ‌న్ -2 లో ఉన్న‌ట్లు అయితే ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వాలి. ఇటీవ‌లే మ‌నీషా కోయిరాలా 'హీరామండి' వెబ్ సిరీస్ లో న‌టించిన స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.