12 గంటలకు పైగా బురద నీళ్లలోనే నటి!
ముఖ్యంగా నీళ్లలో 12 గం.లు పైగా నానే సీన్ నాకు సవాల్ గా మారిందని మనీషా గుర్తు చేసుకుంది.''ఫౌంటెన్ సీక్వెన్స్ శారీరకంగా తనకు చాలా సవాల్‌గా మారిందని మనీషా తెలిపింది.
By: Tupaki Desk | 13 May 2024 4:15 AM GMTసంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హీరామండి' ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కానీ, నటీమణుల నట ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో వేశ్య మల్లికా జాన్ గా ఒక కీలక పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా నటించింది.
మనీషా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆన్ లొకేషన్ సంగతులను షేర్ చేసారు. ఓ ముఖ్యమైన సీన్ కోసం 12 గంటల పాటు బురద నీళ్లలోనే నానాల్సి వచ్చిందని.. చివరివరకు దర్శకుడు తనని వదలలేదని గుర్తు చేసుకున్నారు. హీరామండి తన కెరీర్ జర్నీలో ఒక ముఖ్యమైన మైలురాయి అని మనీషా అన్నారు. ఇలాంటి విభిన్నమైన పాత్రలో నటించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని మనీషా కొయిరాలా తెలిపారు.
మనీషా కోయిలారా తన సోషల్ మీడియాలో ఇలా వ్యాఖ్యానించారు. ''క్యాన్సర్ వచ్చాక.. అలాగే నాకు 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నా జీవితం మరో దశకు చేరుకుంటుందనేది ఎప్పుడూ ఊహించలేను. ఈ రోజు నేను చాలా ప్రశంసలు అందుకుంటున్నాను.. నిజానికి షూటింగ్ ప్రారంభించేప్పుడు నన్ను వేధించిన సందేహాలు, ఆందోళనలు ఎన్నో. నా శరీరం తీవ్రమైన షూటింగ్ షెడ్యూల్‌లను.. భారీ దుస్తులు ఆభరణాలను భరిస్తుందో లేదో తెలియదని మనీషా వెల్లడించారు.
ముఖ్యంగా నీళ్లలో 12 గం.లు పైగా నానే సీన్ నాకు సవాల్ గా మారిందని మనీషా గుర్తు చేసుకుంది.''ఫౌంటెన్ సీక్వెన్స్ శారీరకంగా తనకు చాలా సవాల్‌గా మారిందని మనీషా తెలిపింది. నన్ను 12 గంటలకు పైగా నీటి ఫౌంటెన్‌లో నిమజ్జనం చేసారు. నీరు వెచ్చగా శుభ్రంగా ఉందని సంజయ్ లీలా నిర్ధారించినప్పటికీ, గంటలు గడిచేకొద్దీ అదే నీరు బురదగా మారింది. నా శరీరంలోని ప్రతి రంధ్రాలు ఆ బురద నీటిలో తడిసిపోయాయి. షూటింగ్ ముగిసే సమయానికి నేను అలసిపోయినా కానీ, నా హృదయంలో ఘాడమైన ఆనందాన్ని అనుభవించాను'' అని మనీషా తెలిపింది. ఒత్తిడికి లోనైనప్పటికీ తన శరీరం దృఢంగా ఉందని మనీషా వెల్లడించింది. మనీషా హీరమండిలో మల్లికాజాన్‌గా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.