Begin typing your search above and press return to search.

కేసీఆర్ డైలాగ్.. క్లారిటీ ఇచ్చేసిన మణిశర్మ

భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ నిర్మించారు.

By:  Tupaki Desk   |   26 July 2024 10:49 AM GMT
కేసీఆర్ డైలాగ్.. క్లారిటీ ఇచ్చేసిన మణిశర్మ
X

ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బ తింటున్నాయి. చిన్న చిన్న అంశాలని కూడా బూతద్దంలో పెట్టి చూడటం వలన కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయనేది సినిమా దర్శకుల వాదన. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం ఆగష్టు 15న పాన్ ఇండియా లెవల్ ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ నిర్మించారు.

తాజాగా ఈ సినిమా నుంచి హీరో, హీరోయిన్ మీద సాగే మాస్ డ్యూయెట్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మార్ ముంతా చోర్ చింతా అంటూ సాగే ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. రామ్ పోతినేని డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అందరికి కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ లో వాడే పడికట్టు పదాన్ని ఉపయోగించారు.

ఏం చేద్దాం అంటావ్ మరి అనే ఈ డైలాగ్ పాటలో సందర్భోచితంగా ఉపయోగించారు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. దీంతో మీమ్స్ లో పదాలని ఉపయోగించుకొని కాసర్ల శ్యామ్ ఈ సాంగ్ రాశారు. దీనిపై కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ని అవమానించే విధంగా ఒక బూతు పాటలో ఆయన డైలాగ్స్ వాడారని దర్శకుడు పూరిని విమర్శించారు. ఆ పదాలు వెంటనే తొలగించాలని వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా మణిశర్మ ఈ పదాలు వాడకంపై ప్రమోషనల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ చాలా మందికి ఒక రోల్ మోడల్. ఆయనలో అందరూ గ్రేట్ లీడర్ ని చూస్తారు. ఏం చేద్దాం అంటావ్ మరి అనే మాటని కూడా చాలా సరదాగా ఉపయోగిస్తారు. ఆయనని గుర్తుంచేసుకోవాలనే ఉదేశ్యంతో పాటలో ఆ డైలాగ్ ని ఉపయోగించడం జరిగింది. అలాగే ఇది హీరో, హీరోయిన్ మీద సాగే ఒక డ్యూయెట్. ఐటెం సాంగ్ కాదని క్లారిటీ ఇచ్చారు. లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ కూడా సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ వాడటంపై వివరణ ఇచ్చారు.

మార్ ముంతా చోర్ చింతా అనే సాంగ్ సోషల్ మీడియాలో రన్ అయ్యే మీమ్స్ తో ఉపయోగించుకొని రాయాలని అనుకున్నాం. అందుకే కేసీఆర్ డైలాగ్ మీమ్స్ లో బాగా వైరల్ అయ్యింది. ఈ కారణంగా సాంగ్ లో ఉపయోగించుకున్నాం. అతన్ని ఎక్కడ కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదని తెలిపారు. ఒకవేళ కేసీఆర్ డైలాగ్ ని ఉపయోగించడం వలన ఎవరి మనోభావాలు దెబ్బ తిన్న క్షమించాలని మణిశర్మతో పాటు టీమ్ మొత్తం కోరారు.