హాస్య బ్రహ్మ దారిలోనే మెలోడీ బ్రహ్మ..!
టాలీవుడ్ ప్రేక్షకులను దాదాపు మూడు దశాబ్దాల పాటు తన కామెడీతో ఉర్రూతలూగించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
By: Tupaki Desk | 21 Aug 2024 11:30 AM GMTటాలీవుడ్ ప్రేక్షకులను దాదాపు మూడు దశాబ్దాల పాటు తన కామెడీతో ఉర్రూతలూగించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. ఆయన కనిపించిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు, పైగా ఆయన కామెడీ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ తరం దర్శకులు ఆయన్ను సరిగ్గా వాడుకోవడం లేదు అంటూ ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మానందంకు తగ్గ మంచి స్క్రిప్ట్, కామెడీ సీన్స్ పడితే తప్పకుండా నవ్విస్తాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
బ్రహ్మానందం గడచిన కొన్ని సంవత్సరాలుగా మెల్లమెల్లగా ఆఫర్లు కోల్పోతూ వస్తున్నారు. ఆయనపై గౌరవంతో అభిమానంతో కొందరు ఆయనతో వర్క్ చేయించినా కూడా నవ్వించలేక పోతున్నారు. ఇదే పరిస్థితి మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా ఎదుర్కొంటున్నాడు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడు. స్టార్ హీరోల సినిమా వస్తుందంటే ఆ సినిమాకు సంగీత దర్శకుడు మణిశర్మ అయ్యి ఉంటాడు. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో 90 శాతం సినిమాలు ఆయన సంగీతం అందించినవే ఉండేవి.
అప్పట్లో మణిశర్మ సంగీతానికి అభిమానులు కాదు వీరాభిమానులు ప్రేక్షకుల్లోనూ ఇండస్ట్రీలోనూ ఉండేవారు. అంతటి అభిమానం సొంతం చేసుకున్న మణిశర్మ ఈ మధ్య కాలంలో తీవ్రంగా నిరాశ పరచుతున్నాడు. తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కి సంగీతాన్ని అందించింది మణిశర్మ అంటే నమ్మే పరిస్థితి లేదు. పేలవమైన పాటలు, తేలిపోయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇతడు దారి తప్పాడు, గాడి తప్పాడు అంటూ ఫ్యాన్స్ తో పాటు, మీడియా సర్కిల్స్ వారు ఇంకా సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు.
కేవలం డబుల్ ఇస్మార్ట్ మూవీ మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో మణిశర్మ సంగీతం అందించిన స్టార్ హీరోల సినిమాలు ఆచార్య, నారప్ప, రిపబ్లిక్ నిరాశ పరిచాయి. సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం అన్నట్లుగా ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి మెలోడీ బ్రహ్మ తీవ్రంగా నిరాశ పరుచుతూ తన పనైపోయింది అనిపించుకుంటున్నాడు. ఆయనపై నమ్మకంతో గౌరవంతో ఇంకా ఆఫర్లు వస్తున్నా కూడా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు.