Begin typing your search above and press return to search.

మంజుమ్మల్ బోయ్స్ కి కలిసి వచ్చేలా ఉందే..!

అయితే ఫ్యామిలీ స్టార్ రిలీజైన ఒక్కరోజు తర్వాత వచ్చిన మంజుమ్మల్ బోయ్స్ కి ఆ సినిమా టాక్ కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   6 April 2024 5:23 AM GMT
మంజుమ్మల్ బోయ్స్ కి కలిసి వచ్చేలా ఉందే..!
X

ఏ భాషలో ఎలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమా అయినా సరే కాస్త బాగుంది అంటే చాలు తెలుగు ఆడియన్స్ ఆ సినిమాపై ఆసక్తి చూపిస్తారు. థియేట్రికల్ రిలీజైతే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ వరకు ఎదురుచూస్తారు. అదే ఓటీటీ రిలీజైతే సొంత భాషలో ఆడియన్స్ కు ఈక్వల్ గా మన తెలుగు ఆడియన్స్ దాన్ని ఆదరిస్తారు. ఈమధ్య వచ్చిన చాలా సినిమాలకు ఇదే జరిగింది. అయితే ఇతర భాషల సినిమాలు థియేట్రికల్ రిలీజై సక్సెస్ అయిన సినిమాలు తెలుగు ఆడియన్స్ కోసం డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఆల్రెడీ తమిళ, కన్నడ సినిమాలు ఇలా తెలుగు మార్కెట్ పై తమ డబ్బింగ్ సినిమాలతో సత్తా చాటుతుండగా కొత్తగా మలయాళ పరిశ్రమ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ పై కన్నేసింది. లాస్ట్ మంత్ ఆల్రెడీ మలయాళంలో సూపర్ హిట్టైన ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అదే దారిలో మరో మలయాళ సినిమా వచ్చింది. మలయాళ పరిశ్రమలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి రికార్డ్ సృష్టించిన మంజుమ్మల్ బోయ్స్ ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.

చిన్ననాటి స్నేహితులంతా కలిసి కొడైకెనాల్ వెళ్లగా అక్కడ గుణ కేవ్స్ లో ఒక ఫ్రెండ్ ప్రమాదంలో చిక్కుకుంటే మిగతా స్నేహితులు ప్రాణాలకు తెగించి ఎలా వారి ఫ్రెండ్ ని కాపాడారు అన్నది సినిమా కథ. మలయాళంలో చిన్న సినిమగా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పిస్తుందని అంటున్నారు. అయితే సమ్మర్ సినిమాల రేసులో లాస్ట్ వీక్ టిల్లు స్క్వేర్ రాగా అది సక్సెస్ అందుకుంది. శుక్రవారం ఫ్యామిలీ స్టార్ గా విజయ్ దేవరకొండ సినిమా వచ్చింది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ చేస్తుంది అనుకున్న ఈ కాంబో ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ చేయలేదని తెలుస్తుంది. అయితే ఫ్యామిలీ స్టార్ రిలీజైన ఒక్కరోజు తర్వాత వచ్చిన మంజుమ్మల్ బోయ్స్ కి ఆ సినిమా టాక్ కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. ఇప్పటికే మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాగా తెలుగు ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెంచిన మంజుమ్మల్ బోయ్స్ తెలుగులో ఆ ఫలితాన్ని కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.