Begin typing your search above and press return to search.

130 కోట్లు తెచ్చిన సినిమాకు.. ఓటీటీ డీల్ సెట్టవ్వట్లే?

ఓటీటీ సంస్థలు కొవిడ్ టైమ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 March 2024 8:53 AM GMT
130 కోట్లు తెచ్చిన సినిమాకు.. ఓటీటీ డీల్ సెట్టవ్వట్లే?
X

ఓటీటీ సంస్థలు కొవిడ్ టైమ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. వైరస్ భయంతో బయటకు వెళ్లలేని మూవీ లవర్స్.. ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేశారు. అలా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ఆయా సంస్థలు కూడా పోటీపడి మరీ సినిమాలు కొనుగోలు చేశాయి. ఊహించని రేటుకు దక్కించుకుని స్ట్రీమింగ్ చేశాయి. కొన్ని సినిమాలు.. నేరుగా ఓటీటీలోకి కూడా రిలీజ్ అయ్యాయి. అందుకు మేకర్స్ కు పెద్ద మొత్తంలో చెల్లించేవారు ఓటీటీ నిర్వాహకులు.


అయితే ఇప్పుడు ఓటీటీలకు సినీ ప్రియులు బాగా అలవాటు పడ్డాక.. వాటి యాజమాన్యాల తీరు మారినట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అప్పట్లోలాగా ఎగబడి సినిమాలు కొనుగోలు చేయకుండా.. ఆచితూచి కొంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల డిజిటల్ రైట్స్ అమ్ముడవడం కూడా కష్టంగా మారింది. సూపర్ హిట్ సినిమాల ఓటీటీ రైట్స్ భారీ ధరకు సేల్ అయ్యేవి. కానీ ఇప్పుడు నిర్మాతలు అడుగుతున్న డబ్బులను ఓటీటీలు ఇవ్వడం లేదు.

ఇప్పుడు ఇదే సమస్య.. మొదటి రోజు నుంచి సూపర్ హిట్ తో దూసుకుపోతున్న మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన విడుదలైన ఈ మూవీ.. 16 రోజుల్లో రూ.130 కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను వసూళ్ల విషయంలో డామినేట్ చేసింది. సర్వైకల్ థ్రిల్లర్ గా చిదంబరం తెరకెక్కించిన ఈ సినిమా మాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడవలేదు.. అవును మీరు చదివింది నిజమే. మూవీ నిర్మాత రూ.20 కోట్లు అడుగుతున్నారట. కానీ ఓటీటీలు మాత్రం అందులో సగం మాత్రమే ఇస్తామని చెబుతున్నాయట. ఫేమస్ ఓటీటీలు కూడా రూ.20 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదట. కనీసం అడుగుతున్న రేటులో 60 శాతం కూడా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మేకర్స్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారట. మరి ఈ మూవీ ఓటీటీ డీల్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

కొచ్చికి చెందిన ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్.. కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తోంది. అందులో భాగంగా గుణ గుహ గురించి తెలుసుకుంటుంది. గుహలోని కొన్ని ప్రదేశాలకు వెళ్లొద్దని గైడ్ చెబుతున్నా వారంతా వెళ్తారు. డేంజర్ అని రాసి ఉన్నా కూడా ఇంకా లోపలికి వెళ్తారు. రాళ్లపై మంజుమ్మెల్‌ బాయ్స్‌ అని రాస్తారు. ఆ తర్వాత ఓ గొయ్యిలో ఒక యువకుడు పడిపోతాడు. దీంతో అంతా భయపడి బయటకు వచ్చేస్తారు. మరి చివరకు ఏమైంది, తమ ఫ్రెండ్ ను వారు ఎలా కాపాడుకున్నారనేది మిగతా సినిమా.