Begin typing your search above and press return to search.

అతడి గురించి.. ఆ ఒక్కటి అడగొద్దు

మంజు వారియర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మాజీ భర్త దిలీప్ గురించి ఒక ప్రశ్న అడిగిన సమయంలో స్పందించిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 3:30 PM GMT
అతడి గురించి.. ఆ ఒక్కటి అడగొద్దు
X

సౌత్‌ సీనియర్ పాపులర్ హీరోయిన్స్ లో మంజు వారియర్ ఒకరు. తమిళ్ మరియు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన మంజు వారియర్ తెలుగు ప్రేక్షకులకు కూడా డబ్బింగ్‌ సినిమాల ద్వారా సుపరిచితురాలు. ఇంకా కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్న మంజు వారియర్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

గతంలో మంజు వారియర్‌ నటుడు దిలీప్ ని వివాహం చేసుకుంది. వీరి వైవాహిక జీవితంలో కొన్నాళ్లకే గొడవలు మొదలు అయ్యాయి. దాంతో అతడి నుంచి మంజు వారియర్‌ విడి పోయి ఒంటరి జీవితం గడుపుతోంది. విడాకులు తీసుకున్న సమయంలో వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

ప్రస్తుతం కొడుకు తో సింగిల్ మధర్ గా కొనసాగుతూ నటిగా వరుసగా సినిమాల్లో నటిస్తున్న మంజు వారియర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మాజీ భర్త దిలీప్ గురించి ఒక ప్రశ్న అడిగిన సమయంలో స్పందించిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

సాధారణంగా సెలబ్రెటీలు విడిపోయిన తర్వాత కూడా పిల్లల కోసం స్నేహంగా ఉండటం మనం చూశాం. కానీ దిలీప్ గురించి కనీసం స్పందించేందుకు కూడా మంజు వారియర్ ఆసక్తి చూపించలేదు. ఆయన పేరు తన నోట పలికేందుకు కూడా మంజు ఒప్పుకోవడం లేదు.

తాజా ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి దిలీప్ గురించి ఒక ప్రశ్న అడుగుతున్న సమయంలో ఆ ఒక్కటి అడగొద్దు అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. దాంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మరో ప్రశ్న ను అడగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో తో మంజు వారియర్ తెగ వైరల్‌ అవుతోంది.