Begin typing your search above and press return to search.

వీడియో: నాగార్జున మ‌న్మ‌ధుడు బ్యూటీ ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది

అయితే ఇన్నేళ్లు అయినా కానీ ఈ సినిమాలో న‌టించిన సోనాలి బింద్రే మీడియాకు దొరుకుతుంది కానీ ఇందులో న‌టించిన అన్షు మాత్రం క‌నిపించ‌లేదు

By:  Tupaki Desk   |   28 Aug 2023 9:52 AM GMT
వీడియో: నాగార్జున మ‌న్మ‌ధుడు బ్యూటీ ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది
X

'మ‌న్మ‌ధుడు' రిలీజై దాదాపు రెండు ద‌శాబ్ధాలు పైబ‌డింది. నాగార్జున హీరోగా విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం లో సోనాలి బింద్రే, అన్షు నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ - మాట‌లు అందించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించారు. ఇది ప‌ర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ జాన‌ర్ లో తెర‌కెక్కిన సినిమా. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ‌న్మ‌ధుడు 20 డిసెంబ‌ర్ 2002లో రిలీజైంది...అంటే ఇప్ప‌టికి 21 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది.

అయితే ఇన్నేళ్లు అయినా కానీ ఈ సినిమాలో న‌టించిన సోనాలి బింద్రే మీడియాకు దొరుకుతుంది కానీ ఇందులో న‌టించిన అన్షు మాత్రం క‌నిపించ‌లేదు. ఈ భామ మ‌న్మ‌ధుడు త‌ర్వాత‌ ప్ర‌భాస్ స‌ర‌స‌న రాఘ‌వేంద్ర చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత మిస్స‌మ్మ‌లోను క‌నిపించింది. కానీ అంత‌గా టాలీవుడ్ లో ఎందుక‌నో పెద్ద స్థాయి కెరీర్ కోసం ప్ర‌య‌త్నించింది లేదు. ఆ త‌ర్వాత సినిమాల్లో న‌టించ‌నూ లేదు.

యువ‌త‌రంలో చాలా కాలం పాటు మ‌న్మ‌ధుడు అన్షు ఏమైంది? అంటూ చాలా ఆరాలు కొన‌సాగాయి. అయితే మ‌న్మ‌ధుడు లో న‌టించిన త‌ర్వాత నాగార్జున అన్షును క‌నిపించ‌కుండా చేశాడ‌ని కూడా కొంద‌రు చెవులు కొరుక్కున్నారు. గాసిప్పులు వైర‌ల్ అయ్యాయి. అయితే అన్షు ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. అన్షు త‌మిళ్‌లో ప్ర‌శాంత్ న‌టించిన జై సినిమాలో న‌టించి అటుపై త‌న జ‌న్మ‌స్థ‌లం అయిన లండ‌న్‌కు తిరిగి వెళ్లిపోయింది. సినిమాల‌కు దూరం అయ్యాక ఉన్న‌త విద్యను పూర్తి చేసింది. అదే క్ర‌మంలో స‌చిన్ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడి బ్రిట‌న్ (యూకే)లో స్థిర‌ప‌డింది. అక్క‌డే ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం అన్షుకు ఓ కుమార్తె ఉంది. అన్షు మంచి ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. సొంతంగా డిజైన‌ర్ లేబుల్ ఇన్‌స్పిరేష‌న్ కోచ‌ర్ ను కూడా ప్రారంభించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. మ‌న్మ‌థుడు సినిమాలో న‌ట‌న‌కు గాను అన్షుకు ఉత్త‌మ స‌హాయ న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

మ‌న్మ‌ధుడు లో అన్షు అంద‌చందాలు న‌ట‌న‌కు ఫిదా కాని వారు ఉండ‌రు. ఎంతో క్యూట్ గా అంతే హాట్ గా అన్షు క‌వ్వింత రొమాన్స్ ఎంతో ఆక‌ట్టుకున్నాయి. దాదాపు 21ఏళ్ల త‌ర్వాత అన్షు ఇప్పుడు మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చింది. మ‌న్మ‌ధుడు సినిమాని రీరిలీజ్ చేయ‌బోతున్నాం.. అంటూ ప్ర‌చారం చేస్తున్న అన్షు వీడియో ఇప్పుడు యూత్ లో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అవుతోంది. ఆగ‌స్టు 29న మ‌న్మ‌ధుడు రీరిలీజ‌వుతోంది. థియేట‌ర్ల‌లో ఆస్వాధించండి.. ఇందులో నా ఫేవ‌రెట్ సాంగ్ ఇదిగో అంటూ గుండెల్లో ఏముందో క‌ళ్ల‌ల్లో తెలుస్తోంది.. పెద‌వుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది.. ! పాట‌ను లైవ్ చేసింది అన్షు. అంతేకాదు.. చివ‌రిలో అన్షు ఇచ్చిన క్యూట్ ఫ్లైయింగ్ కిస్ ఇప్పుడు యూత్ లో షివ‌రింగ్ పుట్టిస్తోంది.