మన్మధుడు రీరిలీజ్… ఫ్యాన్స్ అసంతృప్తి
అయితే ఫ్యాన్స్ ఆసక్తిగా మన్మధుడు సినిమాని చూడాలని అనుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గ ప్రింట్ రాలేదు
By: Tupaki Desk | 31 Aug 2023 5:22 AM GMTకింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ మూవీ మన్మధుడు రీరిలీజ్ చేశారు. ఈ మధ్య రీరీలీజ్ ట్రెండ్ లో భాగంగానే ఫ్యాన్స్ కోసంప్రత్యేకంగా మన్మధుడు మూవీ కూడా స్పెషల్ షోలు వేశారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడటానికి అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా వెళ్లారు. అయితే తీరా థియేటర్స్ లోకి వెళ్లి మూవీ చూస్తే నాసిరకమైన క్వాలిటీతో విజువల్ ఉండటం ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.
ఆడియో ట్రాక్ బాగానే ఉన్నా కూడా విజువల్ చూడటానికి అంతగా బాగోలేదని టాక్ ఫ్యాన్స్ నుంచి వినిపించింది. ఈ చిత్రాన్ని నిజానికి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నేరుగా రీరిలీజ్ చేశారు. ప్రస్తుతం రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లోకి వస్తున్న సినిమాలు అన్ని కూడా 4కె క్వాలిటీతో ఎంటర్టైన్ చేస్తున్నాయి. పాత ప్రింట్ ని మళ్ళీ మాస్టరింగ్ చేసి 4కె క్వాలిటీలోకి మార్చి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
అందుకే ఫ్యాన్స్ కూడా పాత సినిమాలైనా మళ్ళీ వాటిని థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు. కొన్ని సినిమాలు అయితే రెండు, మూడు రోజుల పాటు ఆడుతున్నాయి. మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య డబ్బింగ్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా 4కె విజువల్ క్వాలిటీతోనే థియేటర్స్ లో సందడి చేసింది.
అయితే ఫ్యాన్స్ ఆసక్తిగా మన్మధుడు సినిమాని చూడాలని అనుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గ ప్రింట్ రాలేదు. స్టూడియో నిర్వహణ బాధ్యతలు సుప్రియ చూస్తున్నారు. ఆమె కొద్దిగా ఫోకస్ పెట్టి ఉంటే 4కె క్వాలిటీతో మన్మధుడు సినిమాని అందించగలిగేది కానీ అలా చేసి ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కింగ్ నాగార్జున బర్త్ డే రోజు అక్కినేని ఫ్యాన్స్ ని మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ వారు పూర్తిగా నిరాశపరిచారనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనిపై సుప్రియ ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ సినిమాల విషయంలో అయిన కాస్తా కేరింగ్ తీసుకొని సినిమాలని రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్ కోరుకుంటున్నారు.