Begin typing your search above and press return to search.

'పులి' విల‌న్ కి ఈసారి నేష‌న‌ల్ అవార్డు స్పెష‌ల్!

బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్ ఎంత‌టి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 2:27 PM GMT
పులి విల‌న్ కి ఈసారి నేష‌న‌ల్  అవార్డు స్పెష‌ల్!
X

బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్ ఎంత‌టి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లో నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు. మ‌నోజ్ ఎంట్రీ ఇస్తే ఆ పాత్ర‌కే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌స్తుంది. ఆయ‌న పోషించిన పాత్ర‌లు చూస్తే ఆయ‌న కోస‌మే ఆపాత్ర‌లు పుట్టాయి? అన్నంత గొప్ప‌గా న‌టిస్తాడు. సినిమా అయినా సిరీస్ అయినా? ఎక్క‌డైనా న‌ట‌న‌తో స‌త్తా చాట‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. అందుకే ఇప్ప‌టికే మూడు సార్లు జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు.

తాజాగా నాల్గ‌వ సారి కూడా జాతీయ అవార్డు అందుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. `ఇంత‌కు ముందు మూడుసార్లు జాతీయ అవార్డు తీసుకున్న‌ప్పుడు ఎలాంటి అనుభూతి పోందానో? ఇప్పుడు అలాగే ఫీల‌వుతున్నాను. కానీ ఈసారి వేడుక‌కు నేను ఒక్క‌డినే కాకుండా నా భార్య‌తో రావ‌డం ప్ర‌త్యేకం. గ‌తంలో ఏ వేడుక‌లోనూ త‌ను పాల్గొన‌లేదు. కాబ‌ట్టి ఈసారి నాకు ఎంత స్పెష‌ల్ గా ఉంటుందో మీరే అర్దం చేసుకోండి.

ఆ భ‌గ‌వంతుడి ద‌య‌తో నాలుగు సార్లు అవార్డు పొందాను. నా జీవితానికి ఇంత‌క‌న్నా ఏం కావాలి. నా మ‌న‌సెంతో సంతోషంతో నిండిపోయింది. ఇలాంటి మూవ్ మెంట్స్ నాకెప్ప‌టికీ గుర్తిండిపోతాయి` అన్నారు. 70వ జాతీయ వార్డుల ప్ర‌దానోత్స‌వంలో భాగంగా మ‌నోజ్ బాజ్ పాయ్ స్పెషల్ జ్యూరీ విభాగం నుంచి (గుల్మొహర్) , సంజోయ్ సలీల్ చౌదరి(ఖాళీ ఖాన్) జాతీయ అవార్డు అందుకుంటున్నారు. అంత‌కు ముండుసార్లు మ‌నోజ్ జాతీయ అవార్డులు అందుకున్నారు.

మ‌నోజ్ బాజ్ పాయ్ తెలుగు ఆడియ‌న్స్ కి సుప‌రిచిత‌మే.` ప్రేమ క‌థ` సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత బ‌న్నీ న‌టించిన `హ్యాపీ` సినిమాలో న‌టించారు. `పులి`, `వేదం` లాంటి చిత్రాల్లోనూ న‌టించారు. ఆయ‌న ఏ పాత్ర‌పో షించినా రెగ్యుల‌ర్ న‌టుల‌కు భిన్నంగా ఉంటాయి. అదే అత‌డిలో ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు.