స్టార్ రైటర్ ని ఏడిపించిన ట్రోలర్స్!
ఆ మధ్య ఆదిపురుష్ సినిమా విషయంలో మనోజ్ ముంతషీర్ కూడా ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Sep 2024 6:45 PM GMTసెలబ్రిటీలు ట్రోలింగ్ గురి అవడం సహజంగా జరిగేదే. ఈ విషయంలో ఎవరూ అతీతులు కాదు. స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకూ అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే. ఏదో సమయంలో ప్రతీ ఒక్కరు ట్రోలింగ్ అనుభవం ఎదుర్కున్నవారే. అయితే వాటిని తీసుకున్న వాళ్లు సీరియస్ గా తీసకుంటారు... తీసుకోని వాళ్లు అసలు పట్టించుకోరు. ఆ మధ్య ఆదిపురుష్ సినిమా విషయంలో మనోజ్ ముంతషీర్ కూడా ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే.
`ఆదిపురుష్` పాత్రల తీరుపై, వాటిని డిజైన్ చేసిన వారిని ఎవ్వరిని ట్రోలర్స్ విడిచిపెట్టలేదు. అందరూ ఒక ఎత్తైతే రచయితను ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేసారు. తాజాగా ఈ ట్రోలింగ్ ఎంతటి మనోవేదనకు గురయ్యాడు? అన్నది ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. `ట్రోలింగ్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను.
ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఈరోజు మంచి రేపు చెడుగానూ మారుతుంది. చెడు కూడా మంచిగా మారుతుంది. నాపై ట్రోలింగ్ చూసి ఎంతో బాధపడ్డాను. కన్నీరు వచ్చేలా ఏడ్చాను. కానీ కృంగిపోలేదు. ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. తిరిగి నిలబడటానికి ప్రయత్నిస్తున్నా. సినిమా అనేది ఓ మార్కెట్. ఇక్కడ ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. కేవలం లాభం మాత్రమే ఆశిస్తారు.
నాతో వారికి ఏదైనా లాభం ఉందంటేనే నా దగ్గరకు వస్తారు. అలా ఇప్పుడు మళ్లీ నన్ను సంప్రది స్తున్నారు` అని అన్నారు. మొత్తానికి ట్రోలింగ్ రచయితలో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన మాటల్ని బట్టి అర్దమవుతుంది. అమితాబచ్చన్..చిరంజీవి లాంలి లెజెండ్స్ సైతం ట్రోలింగ్ ఎదుర్కున్నవారే.