వారసుల చిత్రం అస్సలు నచ్చలేదన్న నటుడు
బాలీవుడ్ అగ్ర తారల వారుసులంతా కలిసి నటించిన' ది అర్చిస్' ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Dec 2023 10:30 AM GMTబాలీవుడ్ అగ్ర తారల వారుసులంతా కలిసి నటించిన' ది అర్చిస్' ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన చిత్రం నెట్ ప్లిక్స్ లో డిసెంబర్ 7న రిలీజ్ అయింది. విమర్శకులు మెచ్చిన చిత్రంగానూ నిలిచింది. ఇక 'ది అర్చీస్' ప్రీమియర్ కి పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరై అనంతరం తమ పీడ్ బ్యాక్ సైతం ఎంతో పాజిటివ్ గా అందించారు.
తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ది అర్చీస్ తనకు ఎంత మాత్రం నచ్చలేదని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కుమార్తెతో కలిసి చూసిన అనంతరం మనోజ్ ఈ వ్యాఖ్యలు చేసారు. నా కూతురుతో కలిసి చూసా. దాదాపు 50 నిమిషాలు చూసాను. నాకు నచ్చలేదు. నా కుమార్తెకు కూడా నచ్చలేదని చెప్పింది.
మోటు పట్లు..రామ్ బలరామ్ వంటి కథలతో నా చిన్నతనం గడిచింది. అర్చీస్ కి సంబంధించిన ఓ పుస్తకాన్ని మాత్రమే చదివినట్లు గుర్తు. వెరోనికా ..బెట్టి పాత్రలు బాగా జ్ఞాపకమున్నాయి. ఈ సినిమా చూశాక అందులో పాత్రల మాదిరి హిందీలో మాట్లాడమని నా కూతురుతో గట్టిగానే చెప్పాను. దానికి తను మా కోసం నువ్వు అస్సలు సమయాన్ని కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది' అని అన్నారు.
'ది అర్చీస్' కామిక్స్ లోని పాత్రలను ఆధారంగా చేసుకుని జోయా అక్తర్ తెరకెక్కించారు. ఈ సినిమాతో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్.. అమితాబచ్చన్ మనవడు అగస్త్య నంద తదిరతులు పరిచయం అయ్యారు. అందరికీ మంచి డెబ్యూ గా నిలిచింది. వారసులంతా కొత్త చిత్రాలతో తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఖుషీ కపూర్ ని పరిచయం చేసే బాధ్యతని కరణ్ జోహార్ తీసుకున్నారు. తన ధర్మప్రొడక్షన్స్ ద్వారా వచ్చే ఏడాది లాంచ్ చేస్తున్నారు.