డాన్స్ అంటే ఇదీ! అని తెలిసి డాన్స్ మానేసిన నటుడు?
గొప్ప డాన్సర్లు ఎవరంటే? టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి...యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుగా గుర్తొచ్చే పేర్లు. డాన్సింగ్ లో వాళ్లు మాష్టర్లు.
By: Tupaki Desk | 27 Nov 2023 5:30 PM GMTగొప్ప డాన్సర్లు ఎవరంటే? టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి...యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుగా గుర్తొచ్చే పేర్లు. డాన్సింగ్ లో వాళ్లు మాష్టర్లు. తమకంటూ ఓ స్టైల్ ఉందని ప్రూవ్ చేసుకు న్న డాన్సర్లు వాళ్లు. ఇక బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ని కొట్టే డాన్సర్ లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత తరం నటుల్లో టైగర్ ష్రాప్ మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ప్రభుదేవా..లారెన్స్ లాంటి వాళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు.
బేసిక్ గానే కొరియోగ్రాఫర్లు డాన్సు అనేది బ్లడ్ లోనే ఉంది. ఇలా ఇండియాలో కొంత మంది డాన్సర్లు ఎంతో ఫేమస్. వాళ్లని స్పూర్తిగా తీసుకుని డాన్సర్లుగా ఎదిగిన వారెంతో మంది. తాజాగా డాన్స్ అంటే ఇది అని తెలుసుకుని డాన్సు మానేసిన నటుడు ఒకరున్నారు. అతనే మనోజ్ బాజ్ పాయ్. `సత్య`.. `హ్యాపీ `...`కొమరం పులి` లాంటి చిత్రాల్లో నటించిన మనోజ్ చేసింది కొన్ని సినిమాలే అయిన నటనలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటిన నటుడు.
ప్రస్తుతం బాలీవుడ్ బిజీ నటుల్లో మనోజ్ ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు. సీరియస్ పాత్రలతో పాటు నవ్వించే పాత్రలు సైతం చేయడం ఆయనకే చెల్లింది. తాజగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మనోజ్..తను డ్యాన్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్పి మరోసారి కడుపుబ్బా నవ్వించారు. `కెరీర్ ప్రారంభంలో నేను డ్యాన్స్ చేసేవాడిని. కానీ ‘కహో నా ప్యార్ హై’లో హృతిక్ రోషన్ చేసిన డాన్సు కు షాక్ అయ్యా. డాన్స్ అంటే ఇది..ఇలాగే ఉండాలి? అని ఓ నిర్ణయానికి వచ్చేసా. అలా చేయడం నా వల్ల కాదు. మరో జన్మ ఎత్తిన సాధ్యం కాదు.
అందుకే జీవితంలో మళ్లీ డాన్సు చేయకూడదని ఆ క్షణం నిర్ణజ్ఞించుకున్నా. అప్పటి నుంచి సీరియస్ గా డాన్సు చేయడం మానేసా. ఎప్పుడైనా సన్నివేశం కోసం సరదా డాన్సు తప్ప. నా డాన్స్ ని మాత్రం సీరియస్ గా తీసుకోవద్దు. హృతిక్ తర్వాత నాకు కనిపించిన మరో గొప్ప డాన్సర్టై గర్ ష్రాఫ్. అతడూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు` అని అన్నారు.