ఓంకార్ మ్యాన్షన్ 24 ట్రైలర్.. బయపెట్టేలా ఉంది కానీ..
అయితే రీసెంట్ గా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓంకార్ తన మార్క్ కు తగ్గట్టుగా హారర్ సీన్స్ ఎలివేట్ చేసినట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 4 Oct 2023 8:23 AM GMTఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఓంకార్ ఆ తర్వాత వెండితెరపై దర్శకుడిగా కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. మొదట్లో అతనికి అపజయం ఎదురైనా కూడా ఆ తరువాత హారర్ కామెడీ కాన్సెప్ట్ లను బాగా క్యాష్ చేసుకున్నాడు. రాజు గారి గది సక్సెస్ కావడంతో ఆ తర్వాత అదే పాయింట్ను కంటిన్యూ చేస్తూ మరో రెండు సినిమాలు చేశాడు.
కానీ అవేమి అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు ఓంకార్ మళ్లీ తనకు కలిసి వచ్చిన హారర్ కాన్సెప్ట్ తో ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిజిటల్ ప్రపంచంలోకి మొదటిసారి అడుగుపెడుతున్న ఓంకార్ మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ కంటెంట్ ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
అయితే రీసెంట్ గా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓంకార్ తన మార్క్ కు తగ్గట్టుగా హారర్ సీన్స్ ఎలివేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక బంగ్లాలోకి వెళ్ళిన తండ్రి కనిపించకుండా పోవడంతో కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా కనిపెట్టింది? అసలు తండ్రి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి ఆ బూతు బంగ్లాలో ఏదైనా దయ్యం ఉందా అనే సందేహాలతో ఆమె కూడా వెళుతుంది.
ఇక మ్యాన్షన్ లోకి ఎవరు వెళ్లినా కూడా వెనక్కి తిరిగిరారు అనే పాయింట్ కూడా హైలెట్ చేస్తూ కొన్ని హారర్ సీన్స్ కూడా ట్రైలర్ లో చూపించారు. అయితే ఇది కాస్త రెగ్యులర్ గా ఉన్నప్పటికీ అసలు కథ ఏమైనా కొత్తగా ఉంటుందేమో అని విధంగా ఓంకార్ క్యూరియాసిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు..మరి ఈ కాన్సెప్ట్ కొత్తగా ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ ప్రాజెక్టులో అయితే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. తమిళ్ తెలుగు నుంచి 20 మంది ఆర్టిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటించారు. ఇక మరికొన్ని ప్రత్యేకమైన పాత్రలలో అవికా గోర్ బిందు మాధవి యువ హీరో నందు కూడా ఇందులో కనిపించబోతున్నారు. క్యాస్టింగ్ అయితే ఆకట్టుకునే విధంగా ఉంది. మరి ఈ వెబ్ సీరీస్ నిజంగా భయపడుతుందా లేదా విడుదల తర్వాత చూడాలి.