Begin typing your search above and press return to search.

మెగాస్టార్ పై మన్సూర్ ఘాటు వ్యాఖ్యలు.. అభిమానులు ఫైర్!

ఈ క్రమంలోనే తాజాగా ఓ తమిళ మీడియాలో చిరంజీవి పై మన్సూర్ అలీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 9:38 AM GMT
మెగాస్టార్ పై మన్సూర్ ఘాటు వ్యాఖ్యలు.. అభిమానులు ఫైర్!
X

తమిళ ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల త్రిష పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ మన్సూర్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ త్రిషకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో మన్సూర్ చిరంజీవి పై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి ఒక్కడే కాకుండా త్రిష, సీనియర్ నటి కుష్బూ లపై కూడా పరువు నష్టం దావా కేసు పెడుతున్నట్లు మీడియా సముఖంగా వెల్లడించాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ తమిళ మీడియాలో చిరంజీవి పై మన్సూర్ అలీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్రిష పై మీరు చేసిన వ్యాఖ్యలను చిరంజీవి ఖండిస్తూ వక్రబుద్ధితో ప్రవర్తించారని చెబితే అందుకు మన్సూర్ అలీ బదులిస్తూ..

" ఎవరిది వక్ర బుద్ధి, చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు మింగాడు. కానీ పేదవాళ్ళకి ఒక్కరికి కూడా సహాయం చేయలేదు. ఆ డబ్బులు అంతా తన అవసరానికి వాడుకున్నాడు తప్పితే పేదవాళ్ళకి హెల్ప్ చేయలేదు. నేను చిరంజీవి, త్రిష, కుష్బూ ముగ్గురి మీద పరువు నష్టం దావా వేస్తాను. అందులో చిరంజీవి మీద రూ.20 కోట్లు త్రిష,ఖుష్బూ మీద చెరో రూ.10 కోట్ల పరువు నష్టం దేవా వేస్తాను. ఆ వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకి ఇస్తాను. ఇది నా ప్రామిస్.

" నిజానికి ఈ విషయంలో చిరంజీవి గారే తప్పు చేశారు. ఏం జరిగిందో ఆయన ముందు తెలుసుకోవాలి. నన్ను అడగాలి. ఫోన్ చేసి ఏం జరిగిందనేది అడగకుండా ఆయన అలా అనడం తప్పు" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మెగాస్టార్ పై చేసిన కామెంట్స్ కి మన్సూర్ అలీపై మెగా ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్సూర్ చిరంజీవిని కావాలనే టార్గెట్ చేస్తున్నాడని, అతను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, అవన్నీ పనికిరాని కామెంట్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.." మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను" అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.