Begin typing your search above and press return to search.

ల‌వ్ రొమాన్స్ అంటే షారూఖ్ అయి ఉండాలి: మ‌ను భాక‌ర్

ఒలింపిక్స్ 2024లో మొద‌టి మెడ‌ల్ సాధించిన క్రీడాకారిణిగా మ‌ను బాక‌ర్ రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2024 8:30 PM GMT
ల‌వ్ రొమాన్స్ అంటే షారూఖ్ అయి ఉండాలి: మ‌ను భాక‌ర్
X

ఒలింపిక్స్ 2024లో మొద‌టి మెడ‌ల్ సాధించిన క్రీడాకారిణిగా మ‌ను బాక‌ర్ రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశానికి గ‌ర్వించ‌ద‌గిన విజ‌యాన్ని అందించింది. ఒలింపిక్ ప‌త‌కం అందుకున్న‌ త‌ర్వాత దేశంలో త‌న‌కు ఫాలోయింగ్ పెరిగింది. అలాగే మ‌ను బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగడంతో ఆదాయం గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్‌పతి 13లో మను భాకర్ క‌నిపించింది.

బాలీవుడ్‌పై తనకున్న అభిమానం గురించి షో హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడింది. క్రీడ‌ల‌తో పాటు సినిమాపై త‌న ప్రేమ‌ను కూడా వ్య‌క్తం చేసింది. ప్రేమ, శృంగార ర‌సం విషయానికి వస్తే షారుక్ ఖాన్ లా ఇంకెవ‌రూ చేయ‌లేర‌ని మ‌ను ప్ర‌శంసించారు. ప్రేమ - రొమాన్స్ లో అది షారుఖ్ ఖాన్ అయి ఉండాలి! అని ఆమె సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంపై అమితాబ్ స్పందిస్తూ- మేడమ్, నేను నా సినిమాల్లో స‌రిప‌డినంత‌ ప్రేమ క‌థ‌లు, శృంగారం కూడా చేశాను అని పేర్కొన్నాడు. అహూతులంతా పగలబడి నవ్వుతుండగా మను .. సర్ ప్రశ్నకు ఇచ్చిన ఆప్ష‌న్ల‌లో మీ పేరు లేదు క‌దా! అన్నారు. మొహబ్బ‌తీన్ సినిమా నుంచి ఒక డైలాగ్ కూడా వినిపించి అమితాబ్ మ‌న‌సును గెలుచుకున్నారు మ‌ను.

నాగ్ అశ్విన్ డిస్టోపియన్ యాక్షన్-థ్రిల్లర్ కల్కి 2898 ADలో నటించిన అమితాబ్, 2025లో సీక్వెల్ లోను న‌టిస్తార‌ని క‌థనాలొచ్చాయి. ఈ సైన్స్-ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, శాశ్వత చటర్జీ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రం హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో..ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఆర్ బాల్కీ `ది ఇంటర్న్` అనుసరణలోను అమితాబ్ న‌టిస్తున్నారు. ఇందులో దీపికతో కలిసి నటించనున్నాడు.