మట్టి కుండల మధ్య క్యూట్ ఏంజెల్!
ఓ పాత ఇంటిలో మట్టి కుండలు తయారు చేస్తోన్న వైనాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 31 Aug 2024 10:30 PM GMTమాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ ఇన్ స్టా సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ ఎంపికల్లో తానో బ్రాండ్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తనదైన మార్క్ అప్పిరియన్స్ తో అలరించడం మానుషీ ప్రత్యేకత. మోడలింగ్ లో ఆరితేరిన బ్యూటీ కావడంతో నలుగురిలో మరింత స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. అయితే ఈసారి రెగ్యులర్ ఫోజులకు భిన్నంగా సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిసింది.
అమ్మడు పసుపు రంగు పువ్వు డిజైన్ పంజాబీ దుస్తుల్లో ఆకర్షణీయంగా ముస్తాబైంది. మ్యాచింగ్ బాటమ్ లో వైట్ కలర్ లెగ్ ఇన్ ధరించింది. ఇలా ట్రెడీషనల్ దుస్తుల్లో మానుషీ కనిపించడం వెర్ రేర్. దీంతో ఈ పిక్ సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. అయితే ఇదంతా షూట్ నుంచి క్యాప్చర్ చేసిన పిక్. ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే? అమ్మడు మట్టి కుండలు తయారు చేస్తోన్న వైనం ఎంతో ముచ్చటేస్తోంది.
ఓ పాత ఇంటిలో మట్టి కుండలు తయారు చేస్తోన్న వైనాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటి జనులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. బ్యూటీఫుల్ స్మైల్ అండ్ క్యూట్ ఏంజిల్ అంటూ పొగిడేస్తున్నారు. అమ్మడి నేచురల్ బ్యూటీకి నెటి జనులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక మానుషీ కెరీర్ సంగతి చూస్తే! ఏ ముహూర్తాన లాంచ్ అయిందో గానీ అన్నీ పరాజయాలే.
డెబ్యూ `సామ్రాట్ పృధ్వీరాజ్` ఆశించిన ఫలితా న్నివ్వలేదు. అటుపై నటించిన `గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ` కూడా నిరాశనమే మిగిల్చింది. టాలీవుడ్ వెంచర్ `ఆపరేషన్ వాలెంటైన్` అదే వరుసలో నిలిచింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సక్సెస్ అవ్వలేదు. దీంతో ఇక్కడ అవకాశాలే లేకుండా పోయాయి. ఇటీవల రిలీజ్ అయిన `బడే మియాన్ చోటే మియాన్` కూడా డిజాస్టర్ నే నమోదు చేసింది. కనీసం ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకుంది. అక్కడా మరోసారి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం జాన్ అబ్రహంతో కలిసి ` టెహ్రాన్` అనే సినిమాలో నటిస్తోంది.