ఉర్పీ జావేద్ రింగులోకి దూరలేక ఇలా సరిపెట్టింది!
ఆ విషయంలో ఆమెకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మార్కెట్ లో పాపులర్ అయింది.
By: Tupaki Desk | 21 Oct 2024 3:43 AM GMTవింతైన డిజైర్ దుస్తులతో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకోవడం ఉర్పీ జావెద్ ప్రత్యేకత అని చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో ఆమెకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మార్కెట్ లో పాపులర్ అయింది. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు కాదు కదా? ప్రపంచంలో ఇంకే భాషకు చెందిన హీరోయిన్ అయినా సరే ఆమెకి పోటీనివ్వడం కూడా కష్టమే. ఉర్పీ జావేద్ ఇంకా ముంబైలో ఉంది? ఫ్యాషన్ షోలు చేస్తుంది గానీ, ఏ హాలీవుడ్ కి వెళ్లి ఉంటే ఇంకా ఫేమస్ అయ్యేదేమో!
తాజాగా మరోసారి తాను వేసుకున్న డ్రెస్ కారణంగా మనసులో హగ్ చేసుకోవాలని ఉన్నా? హగ్ చేసుకోలేని పరిస్థితి రెడ్ కార్పెట్ పై ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో మానుషీ చిల్లర్-ఉర్పీ జావేద్ రెడ్ కార్పెట్ పై ఒకరికొకరు తారస పడ్డారు. దీంతో ఇరువురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సరిపెట్టు కున్నారు. ఉర్పీ వేసుకున్న డ్రెస్ కారణంగా ఆత్మీయ ఆలింగనం చేసుకోలేకపోతున్నానని మానుషీ పోస్ట్ చేసింది.
దీనికి ఉర్పీ జావేద్ స్పందిస్తూ..సారీ నేను కూడా నిన్ను ఇప్పుడు హగ్ చేసుకోలేను. నువ్వు అందంగా కనిపిస్తున్నావ్? చాలా హాట్ గానూ ఉన్నావు. అందం వల్ల నిన్ను ద్వేషిస్తున్నాను అని రాసుకొచ్చింది. దీనికి మానుషీ ఆమెకి కృతజ్ఞత చెప్పింది. ఇంతకీ ఉర్పీ జావేద్ వేసుకున్న డ్రెస్ లోకి ఇంకా దూరలేదు కదూ! ఇదిగో ఇక్కడిలా థై నుంచి జెబబ్ల వరకూ బాడీ కార్న్ డిజైన్ లో ఉన్న దుస్తులు ధరించింది. జెబ్బల కింద నుంచి లెప్ట్ రైట్ కలిపి ఆరు రింగులు కనిపిస్తున్నాయి.
ఈ డ్రెస డిజైన్ అలా ఉంది. దీంతో మానుషీ ఆమెని హత్తుకోలేకపోయింది. ఒకవేళ అలా చేయాలంటే ఆ రింగుల్లోకి ఆమె దూరాలి. అది పెద్ద సాహసమే అవుతుంది. కాబట్టి ఆ సావాసం చేయకుండా ఇలా షేక్ హ్యాండ్ తో సరిపెట్టి ఓ సానుకూల పోస్టుతో ముగించింది. అదీ మ్యాటర్.