బ్యూటీ కోసం సర్జరీలు చేయించుకోకూడదా?
మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ సుపరిచితురాలే. ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది
By: Tupaki Desk | 11 Feb 2024 5:17 AM GMTమాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ సుపరిచితురాలే. ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో 'సామ్రాట్ పృధ్వీరాజ్' లో కనిపించింది. కానీ అమ్మడికి డెబ్యూ ఆశించిన ఫలితా న్నివ్వలేదు. అటుపై నటించిన 'గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' కూడా నిరాశనమే మిగిల్చింది. అయినా ఆ వైఫల్యాలేవి మానుషి కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. కొత్త అవకాశాలు అందుకుంటూనే ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలంటైన్' లో..మరో రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఇక అమ్మడు సోషల్ మీడియాలోనే అంతే యాక్టి వ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హీటెక్కించే ఫోటోలతో యువతని ఆకర్షిస్తుంది. ఫ్యామిలీతో వెకషన్ కి వెళ్లినా..ఒంటరిగా నేచుర్ ని ఆస్వాదిస్తున్నా మానుషీ ఆ నేచుర్ లో కలిసి అందాలు విందు చేస్తుంటుంది.
మోడలింగ్ లో ఓ వెలుగు వెలిగిన భామ కాబట్టి అందాలు విందులో ఎంత మాత్రం వెనకడుగు వేయదు హర్యానా బ్యూటీ. ఛాన్స్ దొరికినప్పుడల్లా తానేంటో ప్రూవ్ చేస్తూనే ఉంది. తాజాగా అమ్మడు బ్యూటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మిస్ వరల్డ్ 2024 ప్రీ లాంచ్ కి హాజరైన అమ్మడు బ్యూటీ గురించి ఎంతకైనా తెగించొచ్చు అందులో తప్పేముంది అంటోంది. 'కొన్ని వందల సంవత్సరాల క్రితమే సౌందర్య నిపుణులు ఉన్నారని ఎంత మందికి తెలుసు. అందానికి ప్రాధాన్యత ఆ నాడే పడింది.
ఇప్పుడు మనమంతా అందం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కారణం వాళ్లే. అందం విషయంలో ఎవరి ఇష్టం వారిది. అందుకోసం ఎలాంటి సర్జరీలు చేసుకున్నా తప్పేముంది. అందం కోసం సర్జరీలు చేయించుకున్న వారిని తప్పు పట్టటం భావ్యం కాదు. అది వారి వ్యక్తిగత విషయం. తమ సంతోషం ఎదుట వారిని ఇబ్బంది పెట్టకుండా..తమ స్వేచ్ఛతో ఎలా ఉన్నా పర్వాలేదు. దాని గురించి ప్రత్యేక చర్చ అవసరం లేదనుకుంటున్నా' అని అంది.