మానుషి చిల్లర్ స్టన్నింగ్ లుక్ వైరల్
తాజాగా మానుషి పర్ఫెక్ట్ టోన్డ్ లుక్ తో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీటిలో మానుషి ఒక అందమైన ప్లేగాళ్ ని తలపిస్తోంది.
By: Tupaki Desk | 10 Aug 2024 2:30 AM GMTమానుషి చిల్లర్ నిరంతర ఫోటోషూట్లతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. 'బడే మియాన్ చోటే మియాన్' లాంటి పెద్ద డిజాస్టర్ మూవీలో నటించినా కానీ, ఈ భామ నిరాశ చెందక తదుపరి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల తన ఇన్‌స్టాలో దూకుడు పెంచింది. వరుసగా బికినీలు, ఈత కొలను దుస్తులతో ట్రీట్ కి సంబంధించిన ఫోటోలను మానుషి షేర్ చేసింది. తాజాగా మానుషి పర్ఫెక్ట్ టోన్డ్ లుక్ తో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీటిలో మానుషి ఒక అందమైన ప్లేగాళ్ ని తలపిస్తోంది. మానుషి బ్లాక్ ఇన్నర్ ని.. బాటమ్ లో డిజైనర్ ఫ్యాంట్ ని ధరించింది. చేతిలో 6 నంబర్ ఉన్న బాల్ ని పట్టుకుని కనిపించింది.
ప్రఖ్యాత కాస్మోపాలిటన్ కవర్ పేజీ కోసం మానుషి చిల్లర్ ఫోజులివి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు కాస్మోపాలిటన్ ఇండియా ఇంటర్వ్యూలో మానుషికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దీని ప్రకారం సీనియర్లు అయిన ప్రియాంక చోప్రా జోనాస్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ల అద్భుతమైన కెరీర్‌లకు ధీటుగా పేరు తెచ్చుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అని ప్రశ్నించగా... మానుషి చిల్లర్ ఇలా వ్యాఖ్యానించారు.
“వారు తమ జీవితంలో సాధించిన అద్భుతమైన విషయాల గురించి నాకు బాగా తెలుసు. వారు తమకంటూ సొంత మార్గాలను చాలా సునాయాసంగా సుగమం చేసుకుంటూ కాలక్రమంలో ప్రపంచ వ్యక్తులుగా మారారు. నా కోసం నేను వారి నుండి ప్రేరణ పొందుతాను. నేను నా స్వంత విషయాలను గుర్తించాలి. అవి నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో చూడాలి. ఇది మిస్ వరల్డ్ వంటి రేసు లేదా పోటీ కాదు.. చివరికి మీరు విజేతగా కిరీటం పొందుతారు.. అని తెలిపింది.