పిక్ టాక్ : అందాల మానుషి కిల్లింగ్ లుక్
నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.
By: Tupaki Desk | 8 May 2024 7:03 AM GMT67వ మిస్ వరల్డ్ 2017 కిరీటంను దక్కించుకున్న హర్యానా బ్యూటీ మానుషి చిల్లర్ భారత్ తరపున ఈ కిరీటం దక్కించుకున్న ఆరవ యువతిగా నిలిచింది. అందంతో పాటు నాలడ్జ్ ఉన్న బ్యూటీ మానుషి చిల్లర్. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.
సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో హీరోయిన్ గా నటించడం ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. కానీ అవేవి కూడా ఈమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. ఇటీవలే ఈ అమ్మడు తెలుగు లో ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో నటించింది.
వరుణ్ తేజ్ నటించిన ఆ సినిమా కూడా కమర్షియల్ గా నిరాశ పరిచింది. అయితే మానుషి చిల్లర్ అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో ఫోటో షూట్ తో ఈ అమ్మడు అదరగొట్టింది.
యాష్ కలర్ నెట్టెడ్ డిఫరెంట్ ఔట్ ఫిట్ లో మానుషి చిల్లర్ క్లీవేజ్ షో చేస్తూ థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె చూపుల్లో మత్తు మందు ఏదో ఉంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతటి అందాల ముద్దుగుమ్మ కు కాలం కలిసి రాకపోవడం వల్లే ఇప్పటి వరకు సినిమాల్లో సక్సెస్ దక్కలేదు. ముందు ముందు ఈ అమ్మడు సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో స్టార్ గా దూసుకు పోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.