Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మత్తెక్కిస్తున్న మానుషి అందాలు

తక్కువ సమయంలో హీరోయిన్‌ గా కూడా ఎక్కువ సినిమాలు చేసింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 7:36 AM GMT
పిక్ టాక్‌ : మత్తెక్కిస్తున్న మానుషి అందాలు
X

67వ ప్రపంచ సుందరి 2017 కిరీటం ను దక్కించుకున్న ముద్దుగుమ్మ మానుషి చిల్లర్‌. ఈ అమ్మడు హరియాణాలో పుట్టింది. వైద్య విద్యను అభ్యసిస్తూ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంది. తక్కువ సమయంలో హీరోయిన్‌ గా కూడా ఎక్కువ సినిమాలు చేసింది.


ఈ అమ్మడు మోడలింగ్ లో కూడా దూసుకు పోతుంది. ఈ మధ్య కాలంలో ఈమె నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకున్నా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అందుకు కారణం సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు అనడంలో సందేహం లేదు.

తల్లి తండ్రి ఇద్దరూ డాక్టర్లు అయినా కూడా మానుషి చిల్లర్‌ మోడలింగ్ మరియు నటనపై ఆసక్తితో మిస్ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంది. అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న ముద్దుగుమ్మ అంటూ పేరు దక్కించుకోవడం మాత్రమే కాకుండా కిరీటం ను కూడా సొంతం చేసుకుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్లీ వేజ్ షో తో పాటు కవ్వించే విధంగా చూస్తూ ఉన్న ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందాల ముద్దుగుమ్మ మానుషి అందానికి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అని మరోసారి నిరూపితం అయ్యింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తుంది. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ముందు ముందు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు నిలవడం ఖాయం అంటూ నెటిజన్స్‌ ఈ ఫోటోలకు కామెంట్స్‌ చేస్తున్నారు.