Begin typing your search above and press return to search.

సన్నని బికినీలో వరుణ్ హీరోయిన్ అందాల మాయ

తాజాగా పింక్ కలర్ బికినీ లో మానుషీ చిల్లర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకో ఫ్రెండ్లీ ఎలిగెన్స్ విత్ డీప్ స్విమ్మర్ అంటూ ఈ ఫోటోలని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 May 2024 8:30 AM GMT
సన్నని బికినీలో వరుణ్ హీరోయిన్ అందాల మాయ
X

ఇండియా నుంచి ప్రపంచ అందాల పోటీలలో విశ్వసుందరిగా కిరీటం అందుకున్న అందగత్తెలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందంతో పాటుగా ఆలోచన, అంతకు మించి సామాజిక దృక్పథం ఉన్న బ్యూటీస్ మాత్రమే ప్రపంచ అందాల పోటీలలో విజేతలుగా నిలుస్తారు. అలా మిస్ వరల్డ్ 2017గా నిలిచిన బ్యూటీ మానుషీ చిల్లర్. ఈ అమ్మడు మిస్ ఇండియా పోటీలలో విన్నర్ గా నిలిచి తరువాత మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా అందుకుంది.

మానుషీ చిల్లర్ అందానికి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. విశ్వ సుందరిగా మారిన తర్వాత మోడలింగ్ లో విశేషంగా రాణిస్తోన్న మానుషీ చిల్లర్ పలు అంతర్జాతీయ ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. మొదటి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో మానుషీకి సక్సెస్ ఇవ్వలేదు.

ఆపరేషన్ వాలంటైన్ మూవీతో మానుషీ చిల్లర్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఈ సినిమా కూడా ఆమె లక్ ఫ్యాక్టర్ ని మార్చలేకపోయింది. ఈ ఏడాది వచ్చిన బడే మియాన్ చోటే మియాన్ కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తెహరాన్ అనే చిత్రంలో మానుషీ చిల్లర్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 6.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ బికినీ లో మానుషీ చిల్లర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకో ఫ్రెండ్లీ ఎలిగెన్స్ విత్ డీప్ స్విమ్మర్ అంటూ ఈ ఫోటోలని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

సముద్ర తీరంలో పింక్ కలర్ స్విమ్ షూట్ లో ఉన్న మానుషీ చిల్లర్ అందంతో మాయ చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జలకన్యలా మెరిసిపోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ స్థాయిలో తన గ్లామర్ తో కుర్రాళ్ళ మనసులు దోచేస్తోన్న మానుషీ చిల్లర్ సిల్వర్ స్క్రీన్ పైన కూడా అంతే స్థాయిలో అలరించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.