రెమ్యునరేషన్ విషయంలో శివాలెత్తిపోయేవాడు!
ఆయన గనుక సినిమా నిర్మాత అయితే పంపిణీ దారులు ధైర్యంగా సినిమా కొనేసేవారు.
By: Tupaki Desk | 24 Sep 2024 5:30 PM GMTకృష్ణకి సరిగ్గా డబ్బులిచ్చిన వారు లేరు...శోభన్ బాబుకి డబ్బులు ఎగ్గొట్టినోళ్లు లేరు అని ఇండస్ట్రీలో చాలా మంది అంటారు. సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలు నిర్మించి నిర్మాత నష్టపోతే కృష్ణ తీసుకున్న పారితోషికం కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసేవారు. డిస్ట్రిబ్యూటర్ల విషయంలోనూ కృష్ణ అంతే చొరవతో వ్యవహరించేవారు. ఆయన గనుక సినిమా నిర్మాత అయితే పంపిణీ దారులు ధైర్యంగా సినిమా కొనేసేవారు.
ఒకవేళ సినిమా ప్లాప్ అయినా నష్టాలు లేకుండా కృష్ణ చూస్తారు? అన్న ధైర్యంతోనే అప్పటి కృష్ణ డిస్ట్రిబ్యూటర్లు అంతా ధీమాగా ఉండేవారు. ఆయన వారసత్వం పుణికి పుచ్చుకుని తనయుడు మహేష్ కూడా అదే మార్గంలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. నిర్మాతల విషయంలో మహేష్ ఎంతో చొరవ తీసుకుంటారు. నష్టాలొచ్చిన నిర్మాతల్ని ఆదుకోవడంలో ఆయన ముందుంటారు.
అయితే అప్పటి ఇండస్ట్రీలో నట భూషణ్ శోభన్ బాబు తీరు మాత్రం భిన్నం. నిర్మాత దగ్గర నుంచి ముక్కు పిండిమరీ ప్రతీ రూపాయి వసూల్ చేసేవారు. డబ్బు విషయంలో శోభన్ బాబు ఎంతో పొదుపు. నేడు ఇండస్ట్రీ లో ఎదిగిన వారి చాలా మందికి పైనాన్షియల్ ప్లానింగ్ అన్నది శోభన్ బాబు ఇచ్చిందే. చిరంజీవి, మురళీ మోహన్ వీళ్లంతా శోభన్ బాబు సూచనలు సలహాలతోనే ఆస్తులు కూడబెట్టిన వారే.
ఓసారి శోభన్ బాబు ప్లానింగ్ లోకి వెళ్తే... నిర్మాతలు ఎవరైనా ఆయన చెప్పిన డేట్కి డబ్బులు ఇవ్వాల్సిందేనట. అలా ఇవ్వకపోతే షూటింగ్ కూడా చేసేవారు కాదుట. వాళ్ల మీద శివాలెత్తిపోయేవారుట. సెట్కి వెళ్లిన తర్వాత కూడా తిరిగి వచ్చేసేవారుట. అయితే ఇంత కఠినంగా వ్యవహరించడానికి ఓ కారణం ఉందని మురళీ మోహన్ అంటున్నారు. ఫలానా నెలలో డబ్బు వస్తుందనే ధీమాతో ఆయన ల్యాండ్ కొనడం..వస్తుందనే డబ్బుని ఎలా ఖర్చు చేయాలి అన్నది ముందే ప్లాన్ చేసి పెట్టుకునేవారుట. అలా రాకపోతే నిర్మొహ మాటంగా అడిగేసేవారు.