Begin typing your search above and press return to search.

ఆ ఒక్క నెలలో బాక్సాఫీస్ వద్ద 3000 కోట్లు పక్కా?

ఈ నాలుగు సినిమాలు అనుకున్న ప్రకారం విడుదలైతే, భారతీయ బాక్సాఫీస్‌ రెండు వారాల్లోనే సుమారు రూ.3,000 కోట్ల టర్నోవర్‌ను చూడవచ్చు.

By:  Tupaki Desk   |   23 March 2025 12:37 PM IST
ఆ ఒక్క నెలలో బాక్సాఫీస్ వద్ద 3000 కోట్లు పక్కా?
X

రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సాలీడ్ రికార్డులు అయితే క్రియేట్ కాబోతున్నాయి. ముఖ్యంగా 2026 మార్చిలో భారతీయ సినీ పరిశ్రమలో భారీ పోటీ నెలకొనేందుకు సిద్ధమవుతోంది. కేవలం 7 రోజుల వ్యవధిలో నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అన్ని కూడా హై వోల్టేజ్ సినిమాలే. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రికార్డులు బ్రేక్ కావడం పక్కా. ఆ వివరాల్లోకి వెళితే..

2026 మార్చి 19న రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' విడుదల కానున్నట్లు రీసెంట్ గా అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్‌ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యష్, ఈ సినిమాతో మరో బిగ్ టార్గెట్ ను సెట్ చేసుకున్నాడు. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాబట్టి, 'టాక్సిక్' కూడా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే సామర్థ్యం ఉందని చెప్పవచ్చు.

మార్చి 20న సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లవ్ అండ్ వార్' విడుదల కానుంది. భన్సాలీ చిత్రాలకు ఉన్న ప్రత్యేకత, రణబీర్, విక్కీ వంటి నటుల క్రేజ్‌ కలిసినప్పుడు, ఈ సినిమా కూడా రూ.1000 కోట్ల టార్గెట్‌ను చేరుకోవడానికి పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. భారీ బడ్జెట్, విస్తృత ప్రమోషన్లతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.

మార్చి 26న నాని నటించిన 'ది ప్యారడైజ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. నాని కెరీర్‌లో ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని తెలుస్తోంది. కంటెంట్ క్లిక్కయితే, ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగలదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మంచి కంటెంట్‌తో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు.

అదే రోజున రామ్ చరణ్ నటిస్తున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న RC16 కూడా విడుదల కానుందని సమాచారం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం, రామ్ చరణ్ క్రేజ్‌ కలిసినప్పుడు, ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగలదని అంచనా. ఇక సినిమా ప్రమోషన్ కి తోడు కంటెంట్ స్ట్రాంగ్ గా క్లిక్కయితే RC16 కూడా వెయ్యి కోట్ల క్లబ్‌ను చేరే అవకాశముంది.

ఈ నాలుగు సినిమాలు అనుకున్న ప్రకారం విడుదలైతే, భారతీయ బాక్సాఫీస్‌ రెండు వారాల్లోనే సుమారు రూ.3,000 కోట్ల టర్నోవర్‌ను చూడవచ్చు. అయితే, అన్ని పెద్ద సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం వల్ల, క్లాష్‌ నుంచి తప్పించుకోవడానికి కొన్ని సినిమాలు విడుదల తేదీలను మార్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా, నాని వంటి హీరోలు ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించే అవకాశం ఉంది. మొత్తం మీద, మార్చి 2026లో భారతీయ సినీ పరిశ్రమలో భారీ పోటీ, ప్రేక్షకులకు పండుగ వాతావరణం నెలకొనేందుకు సిద్ధంగా ఉంది.