Begin typing your search above and press return to search.

మార్కో… తెలుగులో అదిరిపోయే కలెక్షన్స్

మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విపరీతంగా పెరిగాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2025 4:57 PM GMT
మార్కో… తెలుగులో అదిరిపోయే కలెక్షన్స్
X

ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన హైవోల్టేజ్ మలయాళీ యాక్షన్ చిత్రం 'మార్కో' వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 80 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. 21 కోట్ల టేబుల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యింది. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విపరీతంగా పెరిగాయి.

దీంతో దేశ వ్యాప్తంగా 'మార్కో' సౌండ్ వినిపించడంతో మేకర్స్ ఇతర భాషలలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మలయాళం, హిందీ భాషలలో ఒకే సారి రిలీజ్ అయిన ఈ మూవీ నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రీసెంట్ గా తెలుగులో కూడా 'మార్కో' సినిమాని రిలీజ్ చేశారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఏకంగా 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

ఇక రెండో రోజు వీక్ డే అయిన కూడా ఏకంగా 75 లక్షల గ్రాస్ వసూళ్లు చేయడం విశేషం. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో రెండు రోక్జులకి 2.20 కోట్లకి చేరింది. అందులో 1.15 కోట్ల షేర్ ఈ చిత్రానికి వచ్చింది. ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటాలంటే మరో 2 కోట్ల మేరకు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అదే జరిగితే మొదటివారంలో 'మార్కో' తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకొని లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 16 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఈ సినిమా 6.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. నార్త్ ఇండియాలో ఇంపాక్ట్ చూపిస్తున్న ఫస్ట్ మలయాళీ మూవీగా 'మార్కో' రికార్డ్ సృష్టించింది.

ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా ఈ 2024 మలయాళీ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ చిత్రంగా నిలిచే అవకాశం ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

కేరళ - ₹37.80 కోట్లు

కర్ణాటక - ₹3.25 కోట్లు

తెలుగు రాష్ట్రాలు (మలయాళం వెర్షన్ తో కలిపి) - ₹2.70 కోట్లు

హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా - ₹6.45 కోట్లు

ఓవర్సీస్ - ₹29.95 కోట్లు (అంచనా)

మొత్తం వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

గ్రాస్ - ₹80.15 కోట్లు

షేర్ - ₹37.65 కోట్లు