Begin typing your search above and press return to search.

ఇలాంటి సినిమాకు తెలుగులో రికార్డా?

మలయాళంలో రిలీజైన పది రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 9:30 PM GMT
ఇలాంటి సినిమాకు తెలుగులో రికార్డా?
X

మలయాళంలో పెద్దగా అంచనాలు లేకుండా క్రిస్మస్ వీకెండ్లో రిలీజైన 'మార్కో' సినిమా అక్కడ సంచలనం సృష్టించింది. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని రూపొందించిన తొలి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వారం లోపే రూ.60 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. మలయాళ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద నంబరే. మలయాళంలో రిలీజైన పది రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఐతే ఇక్కడ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మరీ టూమచ్ వయొలెన్స్ ఉండడం.. కొన్ని సన్నివేశాలు భరించలేని విధంగా ఉండడంతో సమీక్షకులందరూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరహా సినిమాలు మన దగ్గర ఆడడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ మన ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగులో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘మార్కో’ రికార్డు సృష్టించింది. డే-1 ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా మలయాళ చిత్రాల్లో ‘మంజుమ్మల్’ బాయ్స్‌దే రికార్డు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం.. పులి మురుగన్ వసూళ్లను అధిగమిస్తూ రూ.15 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది.

ఇప్పడు 'మార్కో' ఆ రికార్డును దాటేసింది. మలయాళంలో వచ్చిన పది రోజుల తర్వాత రిలీజైనా.. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా.. ఈ సినిమాలోని సన్నివేశాల గురించి సోషల్ మీడియా జనాలు లబోదిబోమంటున్నా.. అవేవీ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా ఆపలేకపోయాయి. క్రిస్మస్ సినిమాలన్నింటికీ నెగెటివ్ రివ్యూలు రావడం.. సంక్రాంతి సినిమాలు రావడానికి టైం ఉండడంతో వచ్చే వారం రోజులు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ‘మార్కో’నే రూల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుల ో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది.