Begin typing your search above and press return to search.

మార్కో… తెలుగులో ఊహించని ఓపెనింగ్స్

ఈ నేపథ్యంలో సినిమాకి మొదటి రోజు ఏకంగా 1.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 8:22 AM GMT
మార్కో… తెలుగులో ఊహించని ఓపెనింగ్స్
X

ఉన్ని ముకుందన్ హీరో మలయాళంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మోస్ట్ వైలెంట్ మూవీ 'మార్కో' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

హిందీలో వచ్చిన ''యానిమల్', 'కిల్' తర్వాత అంతకు మించి హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో 'మార్కో' ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంలో సినిమాకి హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాకి మొదటి రోజు ఏకంగా 1.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

తెలుగులో హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న మొట్టమొదటి మలయాళీ మూవీగా 'మార్కో' రికార్డ్ సృష్టించింది. తెలుగులో 'పుష్ప 2' హవా ఆల్ మోస్ట్ క్లోజ్ అయిపొయింది. ప్రస్తుతం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. దీంతో 'మార్కో' సినిమాకి ఆదరణ పెరగడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది.

కచ్చితంగా తెలుగులో ఈ చిత్రం భారీ కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. జనవరి 10న 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ కాబోతోంది. అంటే మరో 8 రోజుల పాటు థియేటర్స్ లో ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ రావొచ్చని అనుకుంటున్నారు. ముఖ్యంగా హైవోల్టేజ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి 'మార్కో' బాగా నచ్చుతుందనే మాట వినిపిస్తోంది.

ఈ సినిమాకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 858 షోలు పడ్డాయి. 28.84% థియేటర్స్ ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. మౌత్ టాక్ పబ్లిక్ లోకి బలంగా వెళ్లడంతో థియేటర్స్ ఆక్యుపెన్సీ పెరుగుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. 'పుష్ప 2' తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా 'మార్కో' పేరు వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉన్ని ముకుందన్ తెలుగులో 'జనతా గ్యారేజ్', 'భాగమతి', 'యశోదా' సినిమాలో నటించాడు. ఈ సినిమాలు అతనికి తెలుగునాట మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. అలాగే 'మాలికాపురం' అనే డబ్బింగ్ సినిమాతో ఉన్ని ముకుందన్ సక్సెస్ అందుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వంలో 'మార్కో' మూవీ తెరకెక్కింది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా ఉన్ని ముకుందన్ పేరు వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ తర్వాత దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకునే మల్లు స్టార్ గా ఉన్ని ముకుందన్ మారడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు.