బచ్చల మల్లి కొత్త పాట.. ఆలోచింపజేసేలా ఉందే..
టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లరి నరేష్.. బచ్చల మల్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Dec 2024 12:10 PM GMTటాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లరి నరేష్.. బచ్చల మల్లి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న తెలుగు డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మల్లు బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రావు రమేష్, రోషిణి, అంకిత్ కొయ్య, హరితేజ, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు.
డిసెంబర్ 20వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్, మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో కట్ చేసిన బచ్చల మల్లి టీజర్.. సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
1990 బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ సినిమాలో నరేష్ పూర్తి రగ్డ్ లుక్ లో సందడి చేయనున్నారని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అయితే మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకోగా.. కొత్త సాంగ్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. మరీ అంత కోపం.. కానే కాదు అలంకారం అంటూ సాగుతున్న థర్డ్ లిరికల్ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూర్ణ చారి అందించిన లిరిక్స్ కు సింగర్ సాయి విఘ్నేష్ తన గాత్రంతో ప్రాణం పోశారు. విశాల్ చంద్రశేఖర్.. మరీ అంత కోపం సాంగ్ కు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
విజువల్స్ చాలా నేచురల్ గా బాగున్నాయి. మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో కనిపిస్తున్నా.. అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ లిరిక్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. మరి బచ్చల మల్లి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.