Begin typing your search above and press return to search.

చంద్రబాబును గుర్తు చేస్తున్న మార్క్ ఆంటోని

తమిళ స్టార్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. సెప్టెంబర్ 15న ఆడియెన్స్ ను పలకరించిన ఈ చిత్రానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:01 PM GMT
చంద్రబాబును గుర్తు చేస్తున్న మార్క్ ఆంటోని
X

తమిళ స్టార్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. సెప్టెంబర్ 15న ఆడియెన్స్ ను పలకరించిన ఈ చిత్రానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్నే ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో విశాల్ చెప్పిన ఓ డైలాగ్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వేసిన సైటైర్లు అంటూ కథనాలు వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. ఈ మార్క్‌ ఆంటోని చిత్రం.. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కు టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ యాడ్ చేసి రూపొందించారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. చిత్రంలో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌ జే సూర్య, కమెడియన్ సునీల్‌, రీతూ వర్మ, అభినయ కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాలో 1975 నేపథ్యంలోకి వెళ్లినప్పుడు.. విశాల్ వెన్నుపోటు అనే డైలాగ్ వాడతారు. ఎందుకంటే ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్‌ నటించిన ఎదురులేని మనిషి సినిమాకు హీరో తన స్నేహితుడితో కలిసి థియేటర్‌కి వెళ్తాడు. అప్పుడు హీరో విశాల్ ను.. వెనక నుంచి ఒకడు కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు హీరోకు అతడికి మధ్య తోపులాట జరుగుతుంది. ఈ క్రమంలోనే అతడ షర్ట్‌ చిరిగిపోతుంది.

అప్పుడు వాడి గుండెలపై ఎన్టీఆర్‌ బొమ్మ హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అది చుసిన హీరో.. అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికైనా వెన్నుపోటు పొడిచే అలవాటు లేదురా.. అంటూ ఓ డైలాగ్ చెబుతారు. దీంతో ఈ డైలాగ్ పడగానే.. థియేటర్ కు వస్తున్న పలువురు చంద్రబాబును ఉద్దేశిస్తూ విశాల్ అన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఈ సీన్స్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని రూ. 30 కోట్ల బడ్జెట్‍తో రూపొందించారట. దాదాపు రూ. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.40 కోట్లు. ఈ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 25.45 కోట్ల గ్రాస్, రూ. 12.60 కోట్ల షేర్ వసూళ్లను అందుకుందట. అంటే ఈ చిత్రం ఇంకా దాదాపు రూ. 27 కోట్ల వరకు రావాలి.