మార్క్ ఆంటోనీ.. ఇది పరిస్థితి
కానీ తెలుగులో తమిళ రేంజ్లో ప్రభావం చూపలేకపోతోంది. మొదటి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయ్యాయి
By: Tupaki Desk | 18 Sep 2023 5:55 AM GMTపందెం కోడి, పొగరు తదితర చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న హీరో విశాల్. వరుస యాక్షన్ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. తెలుగు బాక్సాఫీస్‌లోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. చాలా సినిమాలు ఇక్కడ మంచి హిట్లను అందుకున్నాయి. అయితే కొన్నేళ్ల నుంచి విశాల్ రొటీన్ మాస్ మసాలా చిత్రాలతో బోల్తా పడుతున్నారు. చివరగా వచ్చిన 'లాఠీ' మరీ పెద్ద హిట్‌ను అందుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మార్క్ ఆంటోనీగా వచ్చారు. క్రేజీ ట్రైలర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ చిత్రం. సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయింది. అందులోనూ ఈ వారం సరైన పోటీ లేకపోవడంతో చిత్రానికి బాగానే కలిసొస్తుందని అంతా అంచనా వేశారు.
అయితే ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ స్టేటస్‌ను అందుకుంది. కానీ తెలుగులోకి వచ్చే సరికి కాస్త తేడా కొట్టింది. తొలి రోజు తమిళంతో పాటు తెలుగులోనూ డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. విశాల్ కెరీర్లో ఎక్కువగా ఈ వసూళ్లు చాలా ఎక్కువే రూ.12 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు తమిళంలో మరింత ఊపందకుంది. ఆదివారం కూడా మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాలోని కామెడీ, ఎస్ జే సూర్య నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం హౌస్ ఫుల్‌గా నడుస్తోంది.
కానీ తెలుగులో తమిళ రేంజ్లో ప్రభావం చూపలేకపోతోంది. మొదటి రోజు వసూళ్లు బాగానే ఉన్నా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయ్యాయి. సినిమాలోని ఓవర్ డోస్ కామెడీని మనోళ్లు రిసీవ్ చేసుకోలేకపోతున్నారని. దీంతో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇది వసూళ్లపై కాస్త ఎఫెక్ట్ చూపింది.
ఇకపోతే ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. సినిమాలో విశాల్-ఎస్ జే సూర్య గ్యాంగ్‌స్టర్లుగా కనిపించారు. రీతూవర్మ, సెల్వరాఘవన్, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చారు. విజయ్ వేలుకుట్టి - ఎడిటింగ్, అభినందన్ రామానుజం - సినిమాటోగ్రఫీ చూసుకున్నారు. ఎస్.వినోద్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.