మార్క్ ఆంటోని ట్రైలర్: విశాల్ ఈసారి ఏదో మ్యాజిక్ చేస్తుండు!
By: Tupaki Desk | 3 Sep 2023 4:12 PM GMTవెర్సటైల్ స్టార్ విశాల్ మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా `మార్క్ ఆంటోని` వినాయక చతుర్థి కానుకగా ఈ నెల 15న విడుదల కానుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్‌జె సూర్య ఇందులో కీలక పాత్రధారి. ఈ చిత్రం టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి లాంచ్ చేసారు.మార్క్ ఆంటోనీ ప్రపంచంలోకి మనల్ని స్వాగతించే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విశాల్ అతని స్నేహితుడు ఎస్‌జె సూర్య విభిన్న మనస్తత్వం కలిగిన గ్యాంగ్‌స్టర్స్. SJ సూర్య చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ముఖ్యంగా మహిళల విషయంలో.. విశాల్ (ఆంటోని) మాత్రం చాలా వ్యవహారాలు కలిగి ఉండే ప్లేబాయ్. మరోవైపు వేరే టైమ్‌లైన్‌లో, మార్క్ (విశాల్) తిరిగి వెనక్కి వెళ్లి తన తండ్రిని కలవడానికి సిద్ధంగా ఉంటాడు. అతను గతంలోని వ్యక్తులతో మాట్లాడగలిగే ఫోన్‌ను కనుగొంటాడు. కథలో ట్విస్ట్ ఏమిటంటే, మార్క్ తన తండ్రి ఆంటోనీని చంపుతానని ప్రకటించడం..
ట్రైలర్ లో హీరో విశాల్ అనేక గెటప్‌లలో కనిపించాడు. అతను దానిని డ్యూయల్ రోల్స్‌లో అదరగొడుతున్నాడని చెప్పాలి. రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యాలు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. అతనే హీరోతో ..అతడే విలన్ కూడా. ఆంటోని నేరంలో భాగస్వామిగా SJ సూర్య ఫన్నీ అయితే ఇతడు కూల్. రీతూ వర్మ మార్క్ ప్రేమికురాలిగా నటించింది. ఇందులో సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. సిల్క్ స్మిత పాత్రను CGI సహాయంతో సృష్టించడం ఆసక్తికరం. ఆమె అభిమానులకు ఇది స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. ఇంట్రస్టింగ్ సెటప్‌ని ఎంచుకున్న అధిక్ రవిచంద్రన్ మార్క్ ఆంటోనిని అన్ని అంశాలతో సహా మల్టీ-జానర్ మూవీగా మలిచారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ సెటప్, థ్రిల్స్, సైన్స్ ఫిక్షన్ అంశాలు, వినోదం, డ్రామా, యాక్షన్ ఉన్నాయి. డైలాగ్‌లు ఎంతో ఇంపార్ట్ ని ఇస్తున్నాయి.
ప్రతిభావంతుడైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన నేపథ్య సంగీతం తగినంత ఎలివేషన్ ఇచ్చింది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దిలీప్ సుబ్బరాయన్, కనల్ కన్నన్, దినేష్ సుబ్బరాయన్‌లతో పాటు భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. ట్రైలర్‌లోని అన్ని స్టంట్ సీక్వెన్స్‌లు హైలైట్ గా ఉన్నాయి. విజయ్ వేలుకుట్టి ఈ చిత్రానికి ఎడిటర్. ట్రైలర్ సినిమాపై అంచ నాలు పెంచింది. విశాల్, SJ సూర్య, రీతూ వర్మ, సునీల్మ, సెల్వ రాఘవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్.