అతడితో పెళ్లయిన హీరో రిలేషన్‌లో!
పాపులర్ యంగ్ హీరో సహనటిని ప్రేమించి పెళ్లాడాడు. ప్రస్తుతం ఈ బ్యూటీతో తన హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 4 Feb 2025 5:35 PM GMTపాపులర్ యంగ్ హీరో సహనటిని ప్రేమించి పెళ్లాడాడు. ప్రస్తుతం ఈ బ్యూటీతో తన హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆ హీరోకి అంతకుముందు ప్రముఖ దర్శకనిర్మాత(మగ)తో అలాంటి సంబంధం ఉందని ఒక సెక్షన్ మీడియా ప్రచారం సాగించింది. నెపో కిడ్ ని తెరకు పరిచయం చేయడమే గాక, అతడు నిలదొక్కుకునేందుకు సదరు దర్శకనిర్మాత చాలా సహకారం అందించాడు. అంతేకాదు అతడు ఫ్లాపులతో కింద పడిపోయిన ప్రతిసారీ పైకి లేపేందుకు అతడు అండగా ఉన్నారు.
ఆ సమయంలో ఆ ఇద్దరి బంధం ఫిజికల్ గాను ఉందని మీడియాలో ప్రచారమైంది. ఆ హీరో, నిర్మాత డేటింగ్ గురించి చాలా చర్చ సాగింది. అదంతా అటుంచితే, ఆ హీరో పెళ్లి చేసుకున్న హీరోయిన్ కి కూడా ఆ దర్శకనిర్మాత మంచి అవకాశాలు కల్పించాడు. భార్యాభర్తలు ఇద్దరి ఎదుగుదలకు అతడు సహకరించాడు. అయితే అనూహ్యంగా ఆ నిర్మాతతో హీరో డేటింగ్ కట్ అయింది. భార్యకు మాత్రమే అతడు విధేయుడిగా మారాడు.
దీంతో ఈ కొత్త వ్యవహారంపైనా మీడియా అదే పనిగా చర్చిస్తోంది. ఆ ఇద్దరి రిలేషన్ షిప్‌ని తెగ్గొట్టింది ఎవరు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఒకే ఒక్క సమాధానం అతడి భార్య కారణంగా ఆ ఇద్దరి బ్రేకప్. తన భర్తను ఆ వ్యక్తితో సంబంధం నుంచి నెమ్మదిగా, తెలివిగా బయటపడేలా చేసింది ఆమె. ప్రస్తుతం దీనిపై చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ తెలివిగా ప్రముఖ దర్శకనిర్మాతను అవసరానికి ఉపయోగించుకుని ఇప్పుడు తెలివిగా వదిలించుకున్నారన్న గుసగుసా వెబ్ లో చర్చగా మారింది. ఈ ఎపిసోడ్ లో యువహీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? దర్శకనిర్మాత ఎవరో కనిపెట్టగలరా?