Begin typing your search above and press return to search.

ఈ ఏడాది బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌.. 75% లాస్‌!

ధృవ సర్జా హీరోగా వైభవి శాండిల్య హీరోయిన్‌గా ఏపీ అర్జున్‌ దర్శకత్వంలో రూపొందిన మార్టిన్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

By:  Tupaki Desk   |   1 Nov 2024 5:57 AM GMT
ఈ ఏడాది బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌.. 75% లాస్‌!
X

ఈ మధ్య కాలంలో సినిమాల మేకింగ్‌ ఖర్చు భారీగా పెరిగి పోయింది. నటీనటుల పారితోషికం మొదలుకుని ప్రొడక్షన్‌ ఖర్చు వరకు మొత్తం పెరిగింది. అందుకే సినిమాలు లాభాలు దక్కించుకోవాలంటే భారీ విజయాలను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సినిమాలు హిట్ టాక్ వచ్చినా, పర్వాలేదు అనిపించుకున్నా బ్రేక్ ఈవెన్‌ కాని సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా నిర్మాతలు మేకింగ్‌ విషయంలో జాగ్రత్తలు పడటం లేదు. హీరో మార్కెట్‌ ఏంటి.. దర్శకుడి స్టామినా ఏంటి అనే విషయాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌ పెట్టాల్సి ఉంది. ఏదో నమ్మకంతో సినిమాకు కోట్లు కుమ్మరిస్తే భారీ నష్టాలు తప్పవని మరోసారి నిరూపితం అయ్యింది.

కన్నడ మూవీ మార్టిన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధృవ సర్జా హీరోగా వైభవి శాండిల్య హీరోయిన్‌గా ఏపీ అర్జున్‌ దర్శకత్వంలో రూపొందిన మార్టిన్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కన్నడ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మార్టిన్‌ సినిమాకు నిర్మాతలు ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేయడం జరిగిందట. కన్నడ తో పాటు తెలుగు ఇతర భాషల్లో విడుదల అయిన మార్టిన్ ఏ ఒక్క చోట గౌరవ ప్రధమైన ఓపెనింగ్స్‌ను రాబట్టలేదు. అంతే కాకుండా కనీసం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.20 కోట్ల లోపు వసూళ్లను రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి.

సినిమాకు పెట్టిన మొత్తంలో నిర్మాతలు కనీసం థియేటర్‌ల ద్వారా 25 శాతం రాబట్టడంలో విఫలం అయ్యారు. ఈ స్థాయిలో సినిమా డిజాస్టర్‌ కావడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కన్నడ సినిమాలు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ కథలో మ్యాటర్ లేకుండా, నటీ నటుల్లో సత్తా లేకుంటే అంత బడ్జెట్‌ దండగా అని మరోసారి నిరూపితం అయింది. సోషల్‌ మీడియాలో మార్టిన్‌ సినిమా గురించి ఎంత ప్రచారం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు లాగా మారిపోయింది.

ఈ సినిమాకు వంద కోట్లు వచ్చినా ఇతర రైట్స్ ద్వారా మరో రూ.50 కోట్లు వచ్చి ఉండేవి. కానీ సినిమా కేవలం 20 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఇతర రైట్స్ ద్వారా కనీసం రూ.20 కోట్లు అయినా వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్టిన్‌ సినిమా ద్వారా నిర్మాతకు రూ.100 కోట్లకు మించి నష్టం అనే టాక్‌ వినిపిస్తోంది. ఒక సినిమా ద్వారా వంద కోట్లకు పైగా నష్టం అంటే మామూలు విషయం కాదు. ఇది కన్నడ సినిమా నిర్మాతలతో పాటు అందరికీ గుణపాఠం వంటిది అనడంలో సందేహం లేదు. ఇలాంటివి ఎన్ని జరిగినా నిర్మాతలు అనాలోచితంగా వందల కోట్ల బడ్జెట్‌ పెట్టడం, భారీ ఎత్తున నష్టపోడవం అనేది చాలా కామన్‌గా జరుగుతూనే ఉంది.