ట్రైలర్ టాక్: సంపూర్ణేష్ బాబు ఓటు కోసం ఎన్ని తిప్పలో..
హృదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కమెడియన్ సంపూర్ణేశ్ బాబు.. చాలా కాలం తర్వాత నటిస్తున్న కొత్త చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'
By: Tupaki Desk | 2 Oct 2023 7:25 AM GMTహృదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కమెడియన్ సంపూర్ణేశ్ బాబు.. చాలా కాలం తర్వాత నటిస్తున్న కొత్త చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
800 ఏళ్ల పూర్వము అంటూ గ్రామ పంచాయితీ ఎన్నికల బోర్డును చూపిస్తూ స్టేజ్ డ్రామాతో మొదలైన ఈ ప్రచారం చిత్రంలో.. ఓ గ్రామంలోని ఉత్తరం - దక్షిణం అంటూ రెండు వర్గాల ప్రజలను, వారి మధ్య జరిగే ఆధిపత్య పోరును ఫన్నీ ఫన్నీగా చూపించారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో డబ్బుల కోసం నరేశ్ - వెంకటేశ్ మహా ప్రత్యర్థులుగా పోటీకి దిగడం, ఆ తర్వాత ఎన్నికలు రసవత్తరంగా సాగడం, దానికి కామెడీ ఎలిమెంట్స్‌ను జోడించి చక్కగా చూపించారు.
అయితే ఇరు వర్గాలకు గెలవడానికి ఒకే ఒక్క ఓటు కావాల్సిన సమయంలో సంపూర్ణేశ్ బాబు ఓటు కీలకంగా మారడం, దీంతో అతడి ఓటు కోసం ఇరు వర్గాలు, ఊరి ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూడటం, కానీ సంపూర్ణేశ్ బాబు ఎవరికి ఓటు వేయాలో తెలీక ఉండటం వంటి సన్నివేశాలను చూపించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు అనామకుడిగా ఉన్న అతడికి తాయిలాలను ఇచ్చి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించడం అంతా ఫన్నీ ఫన్నీగా సాగింది. మొత్తంగా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రచార చిత్రం నవ్వులు పూయించింది.
ఇకపోతే ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ పొలిటికల్ సెటైరికల్ మూవీని వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, డైలాగులు వెంకటేష్ మహా అందించారు. సమరన్ సాయి సంగీతం సమకూర్చారు.
అక్టోబర్ 27న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. మరి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సంపూర్ణేశ్.. ఈ చిత్రంతోనైనా ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి..