Begin typing your search above and press return to search.

చిన్న సినిమా..రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రీమియ‌ర్స్‌

అదే 'మార్టిన్ లూథ‌ర్ కింగ్‌'. బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించ‌గా, పూజ కొల్లూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని ఎస్‌. శ‌శికాంత్‌, చ‌క్ర‌వ‌ర్తి రామ‌చంద్ర నిర్మించారు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 1:01 PM GMT
చిన్న సినిమా..రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రీమియ‌ర్స్‌
X

క్రేజీ సినిమాల‌కు ప్రీమియ‌ర్స్ ఓ బూస్ట్ అన్న‌ది అంద‌రికి తెలిసిందే. ఓవ‌ర్సీస్‌లో స్టార్స్ సినిమాల‌కు ప్రీమియ‌ర్స్‌తో వ‌చ్చే కిక్కే వేరు. ఆ లెక్క‌ల‌ని బ‌ట్టే అక్క‌డ స్టార్ హీరో సినిమా ఏ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌బోతోంద‌న్న‌ది ఫ్యాన్స్‌, ట్రేడ్ వ‌ర్గాలు ఓ అంచానాకు వ‌స్తుంటాయి. ఒక‌టి రెండు రోజుల ముందు యుఎస్ ప్రీమియ‌ర్స్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ చిన్న సినిమాకు కూడా పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ని ఏర్పాటు చేయ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

పెయిడ్ ప్రీమియ‌ర్స్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు చాలా చిన్న సినిమాలు మంచి ఫ‌లితాల‌ని సాధించాయి. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి వంటి ప‌లు సినిమాల‌తో చిన్న సినిమాల ఫ్రీ ప్రీమియ‌ర్‌ల‌ని ప్రారంభిస్తే ఇప్పుడు అది చిన్న సినిమాల‌కు కూడా పెయిడ్ ప్రీమియ‌ర్స్ వేసే స్థాయికి చేరింది. 'రైట‌ర్‌ ప‌ద్మ‌భూష‌ణ్‌' ఈ విష‌యంలో కొత్త ఒర‌వ‌డిని సృష్టించింది. ఆ త‌రువాత అదే సంప్ర‌దాయాన్ని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, బేబి, మ్యాడ్ లాంటి సినిమాలు కంటిన్యూ చేశాయి.

అయితే ఈ ట్రెండ్‌ని ఓ చిన్న సినిమా కొత్త మ‌లుపు తిప్పుతోంది. ఒక్కో సినిమా ఇంత వ‌ర‌కు రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందు పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ని ప్లాన్ చేస్తూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు ఓ చిన్న సినిమా ఏకంగా రిలీజ్‌కు 18 రోజుల ముందుగానే పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ని ప్లాన్ చేస్తూ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అదే 'మార్టిన్ లూథ‌ర్ కింగ్‌'. బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించ‌గా, పూజ కొల్లూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని ఎస్‌. శ‌శికాంత్‌, చ‌క్ర‌వ‌ర్తి రామ‌చంద్ర నిర్మించారు.

త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన 'మండేలా' సినిమాకు ఇది రీమేక్‌. యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించింది. ఓ సామాన్యుడు త‌న కూతురుకు జ‌రిగిన అన్యాయం కోసం వ్య‌వ‌స్థ‌ని ప్ర‌శ్నించే హృద్య‌మైన క‌థ‌తో రూపొంది ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. 'మండేలా' ఆధారంగా రూపొందించిన 'మార్టిన్ లూథ‌ర్ కింగ్‌'ని అక్టోబ‌ర్ 27న రిలీజ్ చేయ‌బోతున్నారు. సినిమా రిలీజ్‌కు 18 రోజులు ఉండ‌గానే సోమ‌వారం నుంచి పెయిడ్ ప్రీమియ‌ర్స్ మొద‌లు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముందుగా విశాఖ‌ప‌ట్నంలోని ఐనాక్స్ థియేట‌ర్‌లో మార్నింగ్ షోతో ప్రీమియ‌ర్స్ ప్రారంభించారు. త‌రువాత మ‌రో నాలుగు రోజుల్లో విజ‌య‌వాడ‌, నెల్లూరు, క‌ర్నూలు, వ‌రంగ‌ల్‌లో మార్నింగ్ షోల‌తో ప్రీమియ‌ర్స్ ప్రారంభించ‌నున్నారు. ఈ షోల‌కు టీమ్ అంతా హాజ‌ర‌వుతోంది. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లోనూ ప్రీమియ‌ర్ షోలు ఏర్పాటు చేయ‌బోతున్నారు. వెంట‌కటేష్ మ‌హా కీల‌క పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.