మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్.. ఒక్క ఓటుతో కామెడీ డ్రామా
అయితే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. తక్కువ కులానికి చెందిన ఒక వ్యక్తి ఊరి బయట చాలా పేదరికంటెజో కొనసాగుతూ ఉంటాడు.
By: Tupaki Desk | 18 Oct 2023 12:51 PM GMTదసరా బాక్సాఫీస్ హడావుడి తర్వాత రాబోతున్న ఆసక్తికరమైన సినిమాలలో మార్టిన్ లూథర్ కింగ్ ఒకటి. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ మండేలాకు అఫీషియల్ రీమేక్. ఇక ఈ సినిమాకు కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా స్క్రీన్ ప్లే మాటలు అందించగా పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఇక నేడు సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేశారు.
ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్స్ తో హడావిడి మొదలుపెట్టిన ఈ సినిమా అక్టోబర్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. తక్కువ కులానికి చెందిన ఒక వ్యక్తి ఊరి బయట చాలా పేదరికంటెజో కొనసాగుతూ ఉంటాడు. కనీసం పేరు ఏంటో తెలియని ఆ అనాధకు హీరోయిన్ శరణ్య ప్రదీప్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మార్టిన్ లూథర్ కింగ్ అనే నామకరణం కూడా చేస్తుంది.
ఇక కులాల మధ్యన వైషమ్యాలు కొనసాగుతున్న ఆ గ్రామంలో ఎన్నికలు సమీపించడంతో సర్పంచ్ పోటీగా నిలబడిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడం కోసం డబ్బులు కానుకలు జోరుగా పంచుతూ ఉంటారు. సర్పంచ్ అభ్యర్థులుగా ప్రముఖ నటుడు నరేష్ తో పాటు దర్శకుడు వెంకటేష్ మహా ఇందులో పోటాపోటీగా నటించినట్లు తెలుస్తోంది. పెద్దగా పేరున్న క్యాస్ట్ లేని ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత వీళ్ళిద్దరి పాత్రలు ప్రధానంగా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది.
ఇక కులాల మధ్యన కొనసాగే ఎన్నికల సమరంలో తక్కువ కులానికి చెందిన మార్టిన్ లూథర్ కింగ్ ఓటు చాలా ముఖ్యంగా మారుతుంది. అయితే అతను ఎవరికి సపోర్ట్ ఇస్తే అతను గెలుస్తాడు అని తెలిసిన క్రమంలో అతన్ని ఆకర్షించేందుకు కూడా సర్పంచ్ అభ్యర్థులు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. ఇక హీరోయిన్ కింగ్ ను ఆ మాయ నుంచి బయటకు తీసుకు వచ్చి ఓటు విలువ తెలిసేలా చేస్తుంది.
ఇక ఆ తర్వాత అతను ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఏమిటి అసలు ఓటు విలువ అందరికీ అర్థమయ్యేలా ఎలా చెబుతాడు అనే పాయింట్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. మొత్తానికి ట్రైలర్లో సంపూర్ణేష్ బాబు ఒకవైపు సైలెంట్ కామెడీతో మరొకవైపు అమాయకంగా కనిపించాడు. అలాగే ఎమోషనల్ గా కూడా ఈ సినిమాలో అతను కొత్తగా కనిపించబోతున్నాడు. మరి ఈ పాత్ర అతని కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.