Begin typing your search above and press return to search.

కల్కి ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   24 July 2024 6:31 AM GMT
కల్కి ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు
X

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవడంతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషలలో డిస్టిబ్యూటర్స్ కి లాభాలు అందించింది. అలాగే కల్కి ముందు వరకు టాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్స్ కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం థియేటర్స్ మెయింటెనెన్స్ కి సరిపడా కలెక్షన్స్ కూడా సినిమాల నుంచి రాలేదు.

తెలంగాణాలో అయితే ఒకానొక దశలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో క్లోజ్ చేసేంత వరకు యజమానులు వెళ్లిపోయారు. నష్టాలతో థియేటర్స్ నడపడం సాధ్యం కాదని చేతులెత్తేశారు. కొన్ని రోజులు హైదరాబాద్ కి వెలుపల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతబడిపోయాయి. ఏపీలో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉండేది. అయితే కల్కి 2898ఏడీ రిలీజ్ తో థియేటర్స్ యజమానులు కొద్దిగా కోలుకున్నారు.

ఈ ఏడునెలల కాలంలో టాలీవుడ్ లో గట్టిగా చూసుకుంటే మూడు బ్లాక్ బస్టర్ హాట్స్ మాత్రమే ఉన్నాయి. హనుమాన్, టిల్లు స్క్వేర్, కల్కి 2898ఏడీ సినిమాలు మాత్రమే థియేటర్స్ యజమానులుకి కొంత లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలిన సినిమాలు అన్ని రెండు, మూడు రోజులకే ప్రేక్షకులు లేక బోసిపోతూ ఉండేవి. ఇదిలా ఉంటే సింగిల్ స్క్రీన్స్ కి కల్కి మూవీ తిరిగి పునర్జీవం పోసిందని డైరెక్టర్ మారుతి అన్నారు.

తాజాగా ఆయన ఓ మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఏ సందర్భంగా మాట్లాడుతూ కల్కి సినిమా సక్సెస్ చాలా మందికి ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ మూవీతో ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయని, తనని మరింత మోటివేట్ చేసిందని అన్నారు. అందుకే రాజాసాబ్ సినిమాని మరింత బాధ్యతగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తన కూతురు హియ దాసరి కూడా అన్ అఫీషియల్ గా వర్క్ చేస్తుందని మారుతి తెలిపారు. అయితే రాజాసాబ్ సినిమాకి సంబందించిన అప్డేట్స్ మాత్రం మారుతి షేర్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

చాలా రోజుల తర్వాత రాజాసాబ్ తో డార్లింగ్ ఒక కమర్షియల్ ఆల్బమ్ చేయబోతున్నాడని ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలియజేశారు. ప్రభాస్ నుంచి మంచి డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.