Begin typing your search above and press return to search.

ప్రభాస్ అంటే ఇష్టం.. ఆయనే నాకు స్ఫూర్తి

బాలీవుడ్‌ నుండి టాలీవుడ్ వరకు ఎంతో మంది సెలబ్రెటీలు ప్రభాస్ ను అభిమానిస్తున్నాం అంటూ చెప్పుకోవడం

By:  Tupaki Desk   |   3 Aug 2023 6:09 AM GMT
ప్రభాస్ అంటే ఇష్టం.. ఆయనే నాకు స్ఫూర్తి
X

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ కి ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలతో పాటు ఆయన వ్యక్తిత్వం వల్ల కూడా చాలా మంది అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా ఆయన అభిమానుల జాబితాలో ఉంటారు.

బాలీవుడ్‌ నుండి టాలీవుడ్ వరకు ఎంతో మంది సెలబ్రెటీలు ప్రభాస్ ను అభిమానిస్తున్నాం అంటూ చెప్పుకోవడం గతంలో పలు సందర్భాల్లో జరిగింది. ఈ సారి టాలీవుడ్ దర్శకుడు మారుతి కూతురు హియా తనకు ప్రభాస్ పై ఉన్న అభిమానం ను మాటల్లో చెప్పుకొచ్చింది. ఆమె తాజా చిట్‌ చాట్‌ లో ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పింది.

హియా మంచి పెయింటర్‌. ఆమె తన పెయింటింగ్స్ తో ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్యాలరీలో టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు హాజరు అయ్యారు. ఆ సందర్బంగా మాట్లాడుతూ ప్రభాస్‌ ఎంతో మంచి వారు.. హుందాగా ఉంటారు. ఏ విషయం లో కూడా ఆయనలో గర్వం అనేది కనిపించదు.

ప్రతి ఒక్కరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడుతారు. తన చుట్టూ ఉన్న వారిని చాలా ప్రేమగా పలకరిస్తూ అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ ఉంటారు. ఇక అందరికి కూడా ప్రభాస్‌ చాలా ప్రేమగా ఫుడ్ పెడతారు. ఆయన కి ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎదుటి వాళ్లకు సాయం చేసే విషయంలో నాకు ఆయన స్ఫూర్తి అంటూ హియా వ్యాఖ్యలు చేసింది.

మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ షూటింగ్ మాత్రం చకచక జరుగుతూనే ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో ఈ సినిమా రూపొందుతోంది. మారుతి సినిమా షూటింగ్‌ లో ప్రభాస్ పాల్గొన్న సమయంలో హియా ఆయనను కలిసి ఉంటుంది. అలా కలిసిన సమయంలో అభిమానం మరింత పెరిగి ఉంటుంది.