Begin typing your search above and press return to search.

మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.. కామెడి రైడ్ మొదలైంది

సాధారణంగా సినిమా థియేట్రికల్ రిలీజ్‌కి ముందు ప్రీమియర్ షోలు ప్లాన్ చేసే సందర్భాలు తక్కువే ఉంటాయి.

By:  Tupaki Desk   |   23 Aug 2024 5:24 AM GMT
మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.. కామెడి రైడ్ మొదలైంది
X

సాధారణంగా సినిమా థియేట్రికల్ రిలీజ్‌కి ముందు ప్రీమియర్ షోలు ప్లాన్ చేసే సందర్భాలు తక్కువే ఉంటాయి. అయితే, కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్న నిర్మాతలు మాత్రమే ప్రీమియర్లతో ధైర్యంగా సిద్ధమవుతారు. ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ “మారుతీనగర్ సుబ్రహ్మణ్యం” సినిమాకు హైదరాబాదులో 3 థియేటర్లలో, కాకినాడలో 1 థియేటర్‌లో నిన్న రాత్రి ప్రీమియర్లు నిర్వహించారు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాత్రి ప్రీమియర్ షోల అనంతరం ఈ సినిమాకు సానుకూల స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఈ సినిమా ఒక తేలికైన కామెడీ ఎంటర్‌టైనర్ అని, మధ్య తరగతి కుటుంబాలలో ఉండే సమస్యలు, వినోదాత్మక పరిస్థితులను హాస్యంగా మలిచారని చర్చ జరుగుతోంది.

ఇదే కాకుండా, రావు రమేష్ ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అందరి మెప్పుని సంపాదించారు. మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను అలరిస్తోంది. ఆయన ఖాతాలో అనుకోకుండా పెద్ద మొత్తం డబ్బు క్రెడిట్ అవడం, ఆ తరువాత జరిగే హాస్య పరిణామాలు సినిమా మేజర్ హైలైట్ గా నిలిచాయి.

సినిమా తొలి భాగం పూర్తిగా వినోదంతో నిండిపోయినదిగా, ఎమోషనల్ క్లైమాక్స్ తో స్ఫూర్తిదాయక ముగింపు ఇచ్చిందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ప్రీమియర్‌ షోల అనంతరం, రావు రమేష్ మరియు దర్శకుడు లక్ష్మణ్ భావోద్వేగానికి గురై ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవ్వగా, ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎలాంటి సవాలు లేకుండా నిలబెట్టుకుంది.

మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాపై అంత నమ్మకం ఉంచడంతో, ప్రీమియర్లు ప్లాన్ చేయడం వల్ల సినిమా పాజిటివ్ పబ్లిసిటీని సాధించింది. ఈ సినిమాను లక్ష్మణ్ కార్యా డైరెక్ట్ చేయగా, పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జి రాయుడు పెంట్యాల మరియు మోహన్ కార్యా సంయుక్తంగా నిర్మించారు. మరి నేడు గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.