Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. మారుతి ఇలా చేస్తాడని అనుకోలేదు..

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మారుతికి మంచి ఇమేజ్ ఉంది.

By:  Tupaki Desk   |   30 July 2024 4:41 AM GMT
రాజాసాబ్.. మారుతి ఇలా చేస్తాడని అనుకోలేదు..
X

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మారుతికి మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా హెల్దీ కామెడీ పండించడంలో మారుతి దిట్ట. హర్రర్ కామెడీ జోనర్ కి క్రేజ్ తీసుకొచ్చింది కూడా మారుతినే. యూత్ లో ఉండే అల్లరిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ఆ అడల్ట్ కామెడీ జోనర్ కథలకి 'ఈ రోజుల్లో' సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు.మతిమరుపు తో కూడా మంచి ఫన్ జెనరేట్ చేయొచ్చని భలే భలే మగాడివోయ్ సినిమాతో ప్రూవ్ చేశారు. రియాలిటీకి దగ్గరగా ఉండే అంశాలని తీసుకొని తెరపై హీరో క్యారెక్టరైజేషన్స్ తో కామెడీని పండించడం మారుతి స్టైల్.

ఆయన చివరిగా గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఊహించని విధంగా ఏకంగా పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమా చేసే అవకాశాన్ని మారుతి సొంతం చేసుకున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అని అప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనవసరంగా ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడని విమర్శలు చేశారు. డైరెక్టర్ మారుతి మాత్రం అన్నింటికి ఒక్క గ్లింప్స్ తో ఇప్పుడు సమాధానం చెప్పేసాడు. మారుతి మరీ ఇలా చేస్తాడని అనుకోలేదని ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

అవుట్ డేటెడ్ అయిన హర్రర్ కామెడీ జోనర్ లో ఇండియన్ నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అని సినీ విశ్లేషకులు సైతం కామెంట్స్ చేశారు. కానీ ప్రభాస్ మూవీ చేస్తున్నాడు అంటే కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. తాజాగా రిలీజ్ అయిన ది రాజాసాబ్ గ్లింప్స్ వారి నమ్మకాన్ని మరింత పెంచిందని చెప్పాలి. అలాగే మారుతితో ప్రభాస్ సినిమా ఏంటని విమర్శించిన నోళ్ళు ఒక్క గ్లింప్స్ తో మూతబడిపోయాయి.

ది రాజాసాబ్ సినిమా కోసం అందరూ ఎదురుచూసేలా చేయడంలో మారుతి సక్సెస్ అయ్యారనే మాట వినిపిస్తోంది. రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ జోనర్ ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించనంత అందంగా ది రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ ఉండటం విశేషం.

ఫ్యాన్స్ కూడా ఈ లుక్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దీంతో ది రాజాసాబ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దెయ్యంతో డార్లింగ్ చేసే అల్లరిని చూడాలని ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని గ్లింప్స్ తో పాటు క్లారిటీ ఇచ్చేశారు. ఈ గ్లింప్స్ లో కంటెంట్ ఏంటనేది మారుతి రివీల్ చేయకపోయిన ప్రభాస్ లుక్స్ తో మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేసారని చెప్పాలి.