Begin typing your search above and press return to search.

ఉర్పీ జావేద్ ప్రాక్ మాస్క్..రాజ్ కుంద్రాపై కౌంట‌ర్ ఎటాక్!

ఈయ‌న్ని చూసి ఇన్ స్టాలో రీల్స్ చేసే వాళ్లు కూడా కాపీ కొట్టారు. ఆయ‌న బ్రాండ్ కోసం మాస్క్ లు ధ‌రించి వింతైన వీడియోలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:04 AM GMT
ఉర్పీ జావేద్ ప్రాక్ మాస్క్..రాజ్ కుంద్రాపై కౌంట‌ర్ ఎటాక్!
X

శిల్పాశెట్టి హ‌బ్బీ రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో దొరికిన త‌ర్వాత సొంతింటి గ‌డ‌ప దాటాలంటే ముఖానికి మాస్క్ ఉండాల్సిందే. రాజ్ కుంద్రా ఇప్పుడు ఎక్క‌డికి వెళ్లినా త‌ప్ప‌కుండా ముఖ‌మంతా క‌వ‌ర్ చేసే మార్క్ త‌ప్ప‌నిస‌రి. త‌న ముఖాన్ని జ‌నాల‌కు చూపించ‌లేక‌..మీడియా వారు వెంట ప‌డ‌తార‌నో భ‌యంతో చేస్తున్నాడో ? తెలియ‌దుగానీ రాజ్ కుంద్ర ఇలా మాస్క్ ధ‌రించి ప‌బ్లిక్ లో తిర‌గ‌డం మాత్రం విచిత్రంగానే ఉంది.

ఈయ‌న్ని చూసి ఇన్ స్టాలో రీల్స్ చేసే వాళ్లు కూడా కాపీ కొట్టారు. ఆయ‌న బ్రాండ్ కోసం మాస్క్ లు ధ‌రించి వింతైన వీడియోలు చేస్తున్నారు. త‌ద్వారా కొంత ల‌బ్ది కూడా పొందుతున్నారనుకోండి. తాజాగా ఇన్ స్టా సంచ‌ల‌నం ఉర్పీ జావేద్ కూడా రాజ్ కుంద్రాలా మాస్క్ ధ‌రించింది. అయితే ఈ మాస్క్ రాజ్ కుంద్ర స్టైల్ కాదు..ఉర్పీ త‌న‌దైన శైలి లో ఈ మాస్క్ ని డిజైన్ చేయించుకుంది. త‌న ప్రాక్ డ్రెస్ తోనే ముఖాన్ని క‌వ‌ర్ చేసేలా ఈ డ్రెస్ ని డిజైన్ చేయించింది.

గోధుమ రంగు ప్రాక్ లో అమ్మ‌డు క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించి..ముఖాన్ని మాస్క్ తో క‌వ‌ర్ చేసింది. కెమెరాకి త‌న‌దైన శైలిలో ఫోటోలు ఇచ్చింది. అప్పుడే కారు దిగొచ్చిన రాజ్ కుంద్రా...ఉర్పీ అవ‌తారం చూసి సూప‌ర్ అంటూ సంకేతం ఇచ్చి లొప‌ల‌కి వెళ్లిపోయాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గామారింది. ఒక‌రు ముఖం చూపించ‌లేక ఇష్ట‌ప‌డ‌క చేస్తోన్న ప‌నిని ఇంకొక‌రు అత‌ని డిజైన్ ని కాపీ కొట్టి ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు.

ఇద్ద‌రు భ‌లే ఉన్నారంటూ నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. ఉర్పీ జావెద్ ఏదో స్టైల్ గా ఉంటుం ద‌ని చేసింద‌నుకోండి? ఆ స్టైల్ రేపు ఉండ‌దు. మ‌రి రాజ్ కుంద్రా ఇలా మాస్క్ ధ‌రించి జ‌నాల్లో ఎన్నాళ్లు తిరుగుతాడు? ఏదో ఒక రోజు మాస్క్ తీయ‌క త‌ప్ప‌దు క‌దా? అంటున్నారు నెటి జ‌నులు. ఇదంతా ప‌క్క‌న‌బెడితే ఇటీవ‌లే రాజ్ కుంద్రా..ఉర్పీ పై కొన్ని కామెంట్లు చేసాడు. వాటికి ప్ర‌తిగా ఉర్పీ జావెద్ పోర్న్ కింగ్ అంటూ మండిప‌డింది. ఇంత‌లోనే రాజ్ కుంద్రాలా మాస్క్ ధ‌రించి ఇమిటేట్ చేయ‌డం వెనుక క‌క్ష సాధింపు ఉందా? అన్న డౌట్ రాక మాన‌దు.