రవితేజ మాస్ జాతర.. ఆ కిక్కు గ్యారెంటీనా..?
రవితేజ మాస్ జాతర మీద అంచనాలు పెంచేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. మాస్ జాతరలో రవితేజ మార్క్ ఫన్ ఉంటుందని సినిమాలో మళ్లీ కిక్కు సినిమాను గుర్తు చేస్తుందని అన్నారు.
By: Tupaki Desk | 11 Jan 2025 8:30 PM GMTసక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ. స్టార్ సినిమాలు స్మాల్ బడ్జెట్ సినిమాలు రెండిటినీ కూడా సూపర్ గా బ్యాలెన్స్ చేస్తూ నాగ వంశీ మంచి ప్లానింగ్ తో వస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే నెక్స్ట్ వెంటనే మరో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఆయన బ్యానర్ నుంచి డాకు మహారాజ్ సినిమా వస్తుంది.
బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మార్చి ఎండింగ్ లో విజయ్ దేవరకొండ సినిమాతో వస్తున్నాడు. ఐతే ప్రస్తుతం సితార బ్యానర్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మాస్ జాతర సినిమా వస్తుంది. ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు.
ధమాకా కాంబో హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా గురించి నాగ వంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మాస్ మహారాజ్ రవితేజ ఈమధ్య వరుస సినిమాలైతే చేస్తున్నారు కానీ అందుకు తగిన రిజల్ట్ మాత్రం అందుకోవట్లేదు. ధమాకా తర్వాత వాల్తేరు వీరయ్య అది కూడా చిరంజీవి కాంబోలో హిట్ అనిపించుకుంది. సోలో హిట్ కోసం అటు రవితేజ ఇటు మాస్ రాజా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
రవితేజ మాస్ జాతర మీద అంచనాలు పెంచేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. మాస్ జాతరలో రవితేజ మార్క్ ఫన్ ఉంటుందని సినిమాలో మళ్లీ కిక్కు సినిమాను గుర్తు చేస్తుందని అన్నారు. రవితేజ కిక్ సినిమా సూపర్ హిట్ వైబ్ తెలిసిందే. మళ్లీ అలాంటి కిక్కే మాస్ జాతర ఇస్తుందని అంటున్నారు. మరి నిర్మాత ఇంత కాన్ ఫిడెంట్ గా చెబుతున్నారు అంటే కచ్చితంగా మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మాస్ జాతర నిజంగానే హిట్టు జాతర ఇచ్చేలా ఉంది. రవితేజ కూడా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అసలైతే రవితేజ మాస్ జాతర సినిమా సంక్రాంతికే రావాల్సి ఉంది కానీ మధ్యలో రవితేజకు షోల్డర్ ఇంజ్యూరీ వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. మాస్ జాతర రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా మేకర్స్ డిసైడ్ చేయలేదు.