మాస్ రాజా కాలరెగరేసి చెప్పేదెప్పుడు?
'ధమాకా' ముందు వరుస ప్లాప్ లు..ఆ తర్వాత ప్లాప్ లు ఎదురయ్యాయి. మధ్యలోనే 'ధమాకా' ఊరట నిచ్చినా? తదుపరి ప్లాప్ కంటున్యూటీ తప్పలేదు.
By: Tupaki Desk | 5 Oct 2024 2:30 PMరిలీజ్ కి ముందు కాలరెగరేసి హిట్ కొట్టాలంటే? గట్స్ ఉండాలి..దమ్ము ధైర్యం ఉండాలి. అది నాలో ఉందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి నిరూపించాడు. 'దేవర' రిలీజ్ కి ముందే మరో సినిమా ఈవెంట్ లో హిట్ కొడతానని కాలరెగరేసి చెప్పాడు. కొట్టి చూపించాడు. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ కూడా 'మహర్షి' సినిమా హిట్ అయిన తర్వాత ఇలాగే కాలరెగరేసి కొట్టానని చెప్పాడు.
ఇంతవరకూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇలా కాలరెగరేసి కొట్టిన హీరోలు ఎవరూ లేరు. ఆ రకంగా సినిమా చరిత్రలో ఎన్టీఆర్-మహేష్ నిలిచిపోయారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలరెగరేసి కొట్లాలి? అని గట్టిగా చెప్పాల్సిన హీరో ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్కరు కనిపిస్తున్నారు. అతడే మాస్ రాజా రవితేజ. మాస్ రాజా కి చాలా కాలంగా సరైన సక్సెస్ పడలేదు.
'ధమాకా' ముందు వరుస ప్లాప్ లు..ఆ తర్వాత ప్లాప్ లు ఎదురయ్యాయి. మధ్యలోనే 'ధమాకా' ఊరట నిచ్చినా? తదుపరి ప్లాప్ కంటున్యూటీ తప్పలేదు. వరుసగా నాలుగు పరాజయాలు చూసాడు. 'రావణా సుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్' ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. ఈ వైఫల్యాలు రవితేజ స్టార్ డమ్ పైనా ప్రభావం చూపిస్తున్నాయనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే రవితేజ ఇప్పుడు అభిమానులు ఓ ధీమా కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆయన కూడా కాలరెగరేసి కొడుతున్నాం ఈసారి అనే భరోసా కల్పిస్తే మరింత ఉత్సాహంగా థియేటర్ల వైపు కదలడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ఛాన్స్ రాజా తీసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలున్నాయి.