Begin typing your search above and press return to search.

ముగ్గురు మొనగాళ్లు ఢీ కొట్టబోతున్నారా..?

2025 సంక్రాంతి టార్గెట్ తో ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 11:30 PM GMT
ముగ్గురు మొనగాళ్లు ఢీ కొట్టబోతున్నారా..?
X

2025 సంక్రాంతి టార్గెట్ తో ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమాను జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ కి అనుగుణంగానే పర్ఫెక్ట్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమా కూడా మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

ఇక సంక్రాంతికి నేనున్నా అంటూ వస్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. కె ఎస్ బాబీ డైరెక్షన్ లో బాలయ్య బాబు నటిస్తున్న NBK109వ సినిమాను అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ అనుకున్నారు కానీ డిసెంబర్ లో రిలీజ్ చేయడం కుదరదని గుర్తించి సంక్రాంతికే రిలీజ్ లాక్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది.

వెంకటేష్, బాలకృష్ణ లతో విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి రాబోతున్నాడని తెలుస్తుంది. ఈ ఇయర్ సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చి డిజాస్టర్ చవిచూసిన వెంకటేష్ ఎలాగైనా మరో సూపర్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. అందుకే సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వెంకటేష్ 76వ సినిమా కూడా పొంగల్ రేసులో రానుంది.

ఈ ఇయర్ ఎండింగ్ లో అంటే డిసెంబర్ మొదటి వారంలో పుష్ప 2, క్రిస్ మస్ కి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ నుంచి మొదలైతే జనవరి సంక్రాంతి వరకు వరుస భారీ సినిమాల పండుగ జరగబోతుంది. ఐతే 2025 సంక్రాంతికి మాస్ మహారాజ్ సినిమా కూడా ఉంటుందని ఓ టాక్ ఉంది. ఐతే బాలయ్య 109 సినిమాను నిర్మిస్తున్న సితార బ్యానర్ లోనే రవితేజ సినిమా వస్తుంది కాబట్టి సంక్రాంతి సీజన్ లో వారి నుంచి ఏదో ఒక సినిమానే వస్తుందని చెప్పొచ్చు.

సంక్రాంతికి స్టార్ సినిమాల ఫైట్ టాలీవుడ్ లో చాలా కామన్. అది కూడా సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య, వెంకీల మధ్య ఇంతకుముందు కూడా జరిగింది. ఐతే ఈసారి సినిమాల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. మరి ఈ పొంగల్ ఫైట్ లో పైచేయి ఎవరు సాధిస్తారన్నది చూడాలి.