Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. చేస్తే అలాంటి బయోపిక్కే!

మాస్ మహారాజ రవితేజ తదుపరి సినిమా టైగర్ నాగేశ్వరరావు గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Oct 2023 10:39 AM GMT
మాస్ రాజా.. చేస్తే అలాంటి బయోపిక్కే!
X

మాస్ మహారాజ రవితేజ తదుపరి సినిమా టైగర్ నాగేశ్వరరావు గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. వంశీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో రవితేజ చాలా బిజీగా కనిపిస్తున్నాడు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో కూడా రవితేజ స్పెషల్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు అన్ని వైపుల నుంచి రవితేజ సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానం కూడా హైలెట్ అవుతుంది.

ఇటీవల ఏకంగా వరల్డ్ కప్ క్రికెట్ లో కూడా తన సినిమా తో ప్రమోషన్స్ చేశాడు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా తెలుగు లో కామెంట్రీ ఇస్తూ క్రికెట్ లవర్స్ ను కూడా బాగా ఎట్రాక్ట్ చేశాడు. రవితేజకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ఈ ప్రమోషన్స్ లో అర్థమవుతుంది.

ఇక క్రికెట్ లో అవకాశం వస్తే ఎవరి బయోపిక్ లో నటిస్తారు అనే ప్రశ్నకు కూడా రవితేజ చాలా క్లియర్ గా వివరణ ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ పైకి ఎదిగిన విధానం తనకు చాలా ఇష్టమని మధ్యలో కొంత నెమ్మదిగా అతని కెరియర్ సాగినప్పటికీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అని అతని జీవితంకు సంబంధించిన అంశాలు కూడా మరొకరికి ప్రేరణగా నిలుస్తాయి అని అన్నాడు.

ఇక అలాంటి పవర్ఫుల్ బౌలర్ బయోపిక్ లో నటించాలని ఉంది అన్నట్లుగా రవితేజ వివరణ ఇచ్చాడు. దీంతో అటు క్రికెట్ ఫ్యాన్స్ అలాగే రవితేజ ఫ్యాన్స్ రెండువైపులా రవితేజ క్రికెట్ ఆడితే చూడాలని కోరుకుంటున్నారు. 2011 వరల్డ్ కప్ జ్ఞాపకాలను కూడా గుర్తుచేస్తున్న రవితేజ అందులో ధోని ఆటతీరు ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది అని అలాగే విరాట్ కోహ్లీ అంటే కూడా తనకు చాలా ఇష్టం అని క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.