Begin typing your search above and press return to search.

మాస్ రాజా మరో క్రేజీ ప్రాజెక్ట్..!

రీసెంట్ గా భగవంత్ కేసరితో హిట్ అందుకున్న అనిల్ రావిపుడి ఆల్రెడీ రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశాడు

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:35 PM GMT
మాస్ రాజా మరో క్రేజీ ప్రాజెక్ట్..!
X

సినిమా ఫలితాలు ఎలా ఉన్నా దూకుడు తగ్గించని మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమా నిరాశ పరచినా ఈగల్ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈగల్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపుడితో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రవితేజ.

రీసెంట్ గా భగవంత్ కేసరితో హిట్ అందుకున్న అనిల్ రావిపుడి ఆల్రెడీ రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశాడు. మరోసారి ఇద్దరు కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమా తర్వాత వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిశోర్ తో రవితేజ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. కిరణ్ అబ్బవరం తో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తీసి హిట్ అందుకున్న మురళి కిశోర్ రవితేజ కోసం ఒక పీరియాడికల్ కథ రెడీ చేశాడట. ఆల్రెడీ రవితేజకు కథను క్లుప్తంగా చెప్పగా లైన్ బాగుందని చెప్పిన మాస్ రాజా ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడని తెలుస్తుంది. రంగస్థలం నుంచి పీరియాడికల్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. రవితేజతో కూడా డిఫరెంట్ పీరియాడికల్ అటెంప్ట్ తో మురళీ కిశోర్ కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది. కథకు రవితేజ ఫిదా అవగా బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చాక ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని తెలుస్తుంది.

ఫుల్ స్క్రిప్ట్ ఓకే అయితే మాత్రం రవితేజతో మురళి కిశోర్ సినిమా కన్ఫర్మ్ అయినట్టే లెక్క. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఏడాదికి రెండు రిలీజ్ లు కచ్చితంగా ఉండాలని చూసుకుంటున్న రవితేజ అదే ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. మాస్ రాజా ఫ్యాన్స్ కూడా రవితేజ చేస్తున్న సినిమాలతో ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే మూడు, నాలుగు సినిమాలకు ఒక హిట్ వస్తున్న ఈక్రమంలో స్టోరీ సెలక్షన్ లో రవితేజ మరింత ఫోకస్ గా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ధమాకా, వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు. మరి ఈగల్ అయినా రవితేజని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. ఈగల్ తర్వాత అనిల్, మురళి కిశోర్ సినిమాలతో రవితేజ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు.